E-Paper
Advertisement

Maruti Suzuki Celerio CNG : రూ.80తో 35 కి.మీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా!

Maruti Suzuki Celerio CNG : రూ.80తో 35 కి.మీ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్స్ కూడా!
Advertisement
Maruti Suzuki Celerio CNG
Maruti Suzuki Celerio CNG

Maruti Suzuki Celerio CNG : మారుతీ సుజకీ కస్టమర్ల కోసం కొత్త కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో రకరకాల వేరియంట్లు ఉంటాయి. అయితే మారుతీ సెలెరియో సీఎన్‌జీ వేరియంట్‌ పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే కార్ల రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. సీఎన్‌జీపై కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.డీజిల్ ధరలతో పోలిస్తే సీఎన్‌జీ చౌకగా లభిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు ఆల్టో కె10 సిఎన్‌జిలో మంచి మైలేజీని అందిస్తాయి. అయితే వీటి కంటే ఎక్కువ మైలేజ్ ఉన్న కారు మీకు కావాలంటే.. ఆప్షన్ మారుతి సుజుకిలో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

READ MORE : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 50 శాతానికి పెరిగే అవకాశం..

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి దేశంలోనే సిఎన్‌జిపై అత్యధిక మైలేజీని అందిస్తుంది. మీ కొనుగోలు ప్రాధాన్యత మైలేజీ అయితే.. సెలెరియో సీఎన్‌జి‌ను ఎంపిక చేసుకోండి. మారుతి సుజుకి సరసమైన సీఎన్‌జీ మోడల్‌లో సెలెరియో, వాగెనార్ ఆర్, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో వంటివి ఉన్నాయి.

Advertisement

వీటిలో సెలెరియో అత్యంత సిఎన్‌జి ఆధారితమైనది. సెలెరియో సిఎన్‌జి కిలో సిఎన్‌జికి 35.60 కిమీల మైలేజీని ఇస్తుంది. వ్యాగన్ఆర్ సిఎన్‌జి మైలేజ్ 32.52కిమీ, ఆల్టో కె10 సిఎన్‌జి మైలేజ్ 33.85కిమీ, ఎస్-ప్రెస్సో సిఎన్‌జి మైలేజ్ 31.2కిమీ వరకు ఇస్తాయి.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి కార్లలో ఎక్కువ మైలేజీని అందిస్తుంది. మారుతి సెలెరియో ధర రూ. 5.37 లక్షల నుండి రూ. 7.09 లక్షల వరకు ఉంది. అయితే దీని సిఎన్‌జి రియంట్ ధర రూ.6.74 లక్షలుగా ఉంది.

సెలెరియో నాలుగు వేరియెంట్లలో వస్తుంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ,జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇందులో విఎక్స్ఐ సిఎన్‌జిలో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టితో ఉంటుంది.

ఈ ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీలోనే ఫిట్ చేసిన సిఎన్‌జి కిట్ ఆప్షనల్‌గా లభిస్తుంది. ఈ సిన్‌జి పవర్ అవుట్‌పుట్ 56.7PS/82Nm ఉంది. ఇది సాధారణ పెట్రోల్ వెర్షన్ కంటే తక్కువ. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

READ MORE : భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది.. ప్రపంచ వ్యాపారవేత్తలు ప్రశంసలు..

ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు, పాసివ్ కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రిక్ ఓఆర్‌వీఎమ్‌లు ఉన్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×