// // Mahindra Thar Roxx 5 Door Suv - థార్ రాక్స్ ఇండియాలో దిగింది.. ఇక దూకుడే దూకుడు.. ధర ఎంతంటే..? -->
E-Paper
Advertisement

Mahindra Thar Roxx 5 Door Suv: థార్ రాక్స్ ఇండియాలో దిగింది.. ఇక దూకుడే దూకుడు.. ధర ఎంతంటే..?

Mahindra Thar Roxx 5 Door Suv: థార్ రాక్స్ ఇండియాలో దిగింది.. ఇక దూకుడే దూకుడు.. ధర ఎంతంటే..?
Advertisement

Mahindra thar roxx 5 door suv launched in india: దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ఎంతటి ఎత్తుకి అయినా.. ఎంతటి ఘాట్ రోడ్‌ల పై నుంచి అయినా మహీంద్రా కార్లు వెల్లగలవు. అందువల్లనే ఈ కార్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పటికే కంపెనీ చాలా మోడళ్లను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు మరొక మోడల్‌ను లాంచ్ చేసింది. మహీంద్రా కంపెనీ తాజాగా మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్ ఎస్యూవీను భారతదేశంలో లాంచ్ చేసింది.

దీని పెట్రోల్ వేరియంట్ రూ.12.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసింది. అలాగే డీజిల్ వేరియంట్ రూ.13.99 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దీని బేస్ వేరియంట్‌ను ‘ఎంఎక్స్ 1’ పేరుతో విడుదల చేసింది. ఈ వేరియంట్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్ ఎస్యూవీ బేస్ వేరియంట్‌లో ఉన్న ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 18 అంగుళాల స్టీల్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్‌మెటల్ టాప్, యూఎస్బీ సి పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్/ స్టాప్‌‌తో కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Also Read: దిమ్మతిరిగే డీల్.. నిస్సాన్ కార్లపై రూ.1.64 లక్షల భారీ డిస్కౌంట్.. వారికి మాత్రమే..!

ఈ థార్ రాక్స్ సిల్హౌట్‌తో వస్తుంది. అలాగే ఈ రాక్స్ లోని సీట్లు తెల్లటి లెదర్లెట్ అప్‌హోల్‌స్టరీలో రానున్నాయి. ఇంకా డ్యాష్‌బోర్డ్ గురించి మాట్లాడితే.. ఇది బ్లాక్ లెదర్ ప్యాడింగ్‌తో ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ కూర్చునే వారికోసం ఇండిపెండెంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు అందించారు. అలాగే రెండవ వరుసలో సిటింగ్‌లో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్,, ఫోల్డౌట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, హెడ్‌రెస్ట్‌లు వంటివి ఉన్నాయి.

Advertisement

ఇందులో ఫ్రంట్ సైడ్ సీ ఆకారంలో హెడ్ లైట్లు ఎల్‌ఈడీ డిఆర్ఎల్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ బంపర్‌లో కొన్ని సిల్వర్ ఎలిమెంట్స్ కూడా అందించారు. ఇది కాకుండా ఇంటీరియర్‌లో థార్ బ్లాక్ అండ్ బీజ్ థీమ్‌తో వస్తుంది. డ్యాష్‌బోర్డు బ్లాక్ లెదర్ ప్యాడింగ్‌తో వస్తుంది. థార్ రాక్స్ ఎంఎక్స్ 1 వేరియంట్ 160 బిహెచ్‌పి పవర్, 330 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఎంఎక్స్1 డీజిల్ వేరియంట్ 150 బిహెచ్‌పి, 3300 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా కంపెనీ దీని బేస్ వేరియంట్‌ను రూ.12.99 లక్షలుగా తీసుకొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ థార్ రాక్స్‌లోని అన్ని వేరియంటను వాటి ధరలతో తీసుకొ రానుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×