E-Paper
Advertisement

Gas Booking New Rules: 21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే

Gas Booking New Rules: 21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే
Advertisement

Gas Booking New Rules: దేశంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయి. ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయిన 21 రోజుల తర్వాతే మరో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి వీలుంటుంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో గ్యాస్ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 21 రోజుల బుకింగ్ రూల్ అమలు చేస్తున్నాయి. అలాగే ఎల్పీజీ ధర కూడా పెరిగింది. 14.2kg ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచారు. దీంతో ఇప్పుడు గ్యాస్ ధర రూ.913 చేరింది. వినియోగదారులకు సమానంగా గ్యాస్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

21 రోజుల లాక్ ఇన్ పీరియడ్

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రం అవుతుండడంతో చమురు సరఫరా నిలిచిపోతుందనే భయం ప్రజల్లో నెలకొంది. ఈ ఆందోళనతో గ్యాస్ సిలిండర్లు బుకింగ్ పెరగడంతో గ్యాస్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అక్రమ నిల్వలను అరికట్టేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 21 రోజులు పీరియడ్ పెట్టింది.

20 శాతం పెరిగిన బుకింగ్

Advertisement

ఇటీవల పలు నగరాల్లో గ్యాస్ బుకింగ్ భారీగా పెరిగింది. రోజుకు వచ్చే ఆర్డర్ల కంటే 20 శాతం మేర పెరిగాయని ఏజెన్సీలు గుర్తించాయి. యుద్ధం వల్ల భవిష్యత్తులో గ్యాస్ కొరత పెరుగుతుందని భావిస్తున్న జనం, ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చమురు సంస్థలు తెలిపాయి. అందుకే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు 21 రోజుల నిబంధన అమలు చేస్తున్నాయి.

Also Read: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో కొత్త రేట్లు ఇవే!

పానిక్ బుకింగ్ తో సమస్యలు

Advertisement

ఈ రూల్ ప్రకారం రీఫిల్ బుక్ చేసిన తర్వాత 21 రోజుల లోపు మళ్లీ కొత్త సిలిండర్ బుక్ చేసే అవకాశం ఉండదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ వల్ల అవసరం ఉన్న వారికే సిలిండర్లు అందుతాయి. పానిక్ బుకింగ్ కారణంగా చమురు సంస్థల బాట్లింగ్ ప్లాంట్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. జనం ఖాళీ సిలిండర్లను ఇచ్చి కొత్తవి తీసుకునే బదులు, ఉన్న వాటిని స్టోర్ చేసుకుంటున్నారు. దీంతో రీఫిల్లింగ్ ప్లాంట్లకు తగినన్ని ఖాళీ సిలిండర్లు రావడం లేదు. ఫలితంగా బాట్లింగ్ ప్లాంట్ల సామర్థ్యం 20 శాతం వరకు తగ్గిపోయిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×