E-Paper
Advertisement

EMI Missing: ఈఎంఐ ఆలస్యం అయిందా? వెంటనే ఇలా చేయండి?

EMI Missing: ఈఎంఐ ఆలస్యం అయిందా? వెంటనే ఇలా చేయండి?
Advertisement

EMI Missing: ఒకటో తేదీ రాగానే అందరిలోనూ ఒకటే టెన్షన్. అదే ఈఎంఐ టెన్షన్. ఆర్థిక అవసరాలకు కోసం లోన్ తీసుకున్నా? లేదా ఏదైనా వస్తువును ఈఎంఐలో కొనుగోలు చేసినా ఈఎంఐలు పెట్టుకుంటాం. ఒకవేళ ఒక నెల ఈఎంఐ కట్టడం లేట్ అయినా, కట్టకపోయినా.. భారీ వడ్డీలు, క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం.. ఇలా నానా టెన్షన్లు ఉంటాయి. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఈఎంఐ చెల్లించకపోతే వెంటనే బ్యాంకులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

30 రోజుల్లో తిరిగి చెల్లిస్తే

ఒక్కసారి ఈఎంఐ తప్పితే బ్యాంకులు కస్టమర్ల చెల్లింపు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవు. క్రెడిట్‌ బ్యూరోలు.. కస్టమర్లు ఇప్పుడు వరకు చెల్లించిన ఈఎంఐలను గమనిస్తాయి. అప్పుడప్పుడు జరిగే ఒకటి రెండు పొరపాట్లను ప్రామాణికంగా తీసుకోవు. ఒక ఈఎంఐ ఆలస్యమైనప్పటికీ 30 రోజుల్లోపు దాన్ని తిరిగి చెల్లిస్తే క్రెడిట్‌ స్కోరుపై పెద్దగా ప్రభావం పడదని నిపుణులు అంటున్నారు. కానీ అదే పనిగా ఈఎంఐ కట్టం ఆలస్యం అయితే మాత్రం భారీగా వడ్డీ పడుతుంది. అలాగే రికవరీ చర్యలు, క్రెడిట్‌ స్కోరు తగ్గిపోవడం ఉంటాయి.

Advertisement

Also Read:  ఎయిర్‌టెల్ యూజర్లకు రూ.4,000 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఎలా పొందాలో చూసేయండి!

ఈఎంఐ మిస్ అయితే

ఈఎంఐ కట్టడం లేట్ అయితే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మీ ఆర్థిక పరిస్థితిని వివరించాలి. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి ఈఎంఐ చెల్లింపు తేదీని మార్చడానికి, తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి బ్యాంకులు అంగీకరిస్తాయి. చాలామంది భయంతోనో, సరైన సమాచారం లేకో బ్యాంకులను సంప్రదించరు. ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్‌ హిస్టరీ దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ, ఇది అపోహే. ఈఎంఐ మిస్ అయితే జరిమానాలు, వడ్డీలతో భారం పెరిగిపోతుంది. దీనివల్ల వచ్చే ఈఎంఐపై మరింత భారం పడుతుంది. అందుకే ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే సరైనా సమయంలో స్పందించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×