E-Paper
Advertisement

Best SIM in India: కొత్త సిమ్ కావాలా? Jio, Airtel, BSNL, Vi.. సిగ్నల్, ప్లాన్స్, డేటాలో ఏది బెటర్?

Best SIM in India: కొత్త సిమ్ కావాలా? Jio, Airtel, BSNL, Vi.. సిగ్నల్, ప్లాన్స్, డేటాలో ఏది బెటర్?
Advertisement

Best SIM in India: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యవసరంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. అయితే మీరు ఎంత ఖరీదైన ఫోన్ కొనుగోలు చేసినప్పటికీ అందులో సిమ్ తప్పనిసరి. కాల్స్ మాట్లాడటానికి, ఇంటర్నెట్ డేటాకు ఈ సిమ్ గుండె వంటింది. అయితే సరైన నెట్ వర్క్ ఎంచుకోకపోతే.. మీవద్ద ఎంత మంచి ఫోన్ ఉన్న వృథానే. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ప్రధాన టెలికాం నెట్‌వర్క్‌లైన జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), బీఎస్ఎన్ఎల్ (BSNL), విఐ (Vi) లలో ఏ సిమ్ ఎంచుకోవాలన్న దానిపై చాలమందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెట్ వర్క్, రీఛార్జ్ ప్లాన్స్ పరంగా వాటిలో ఏది ఉత్తమమైన ఆప్షన్ గా నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

5జీ నెట్ వర్క్..

జియో దేశంలో విస్తృతమైన 5జీ నెట్ వర్క్ ను కలిగి ఉంది. దాదాపు అన్ని నగరాలు, వేలాది పట్టణాల్లో 5జీ అందుబాటులో ఉంది. జియో Standalone (SA) 5Gని వాడటం వేగం, కనెక్టివిటీ చాలా మెరుగ్గా ఉంటాయి. జియో తర్వాత అత్యధిక ప్రాంతాల్లో ఎయిర్ టెల్ 5G సిగ్నల్స్ ఉన్నాయి. ఇది Non-Standalone (NSA) 5Gని వినియోగిస్తుంది. 4G నెట్ వర్క్ పైనే 5Gని అందిస్తోంది. మరోవైపు విఐ ఇంకా పూర్తి స్థాయిలో 5Gని లాంచ్ చేయలేదు. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ప్రయోగాత్మంగా నడుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4G నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. 5G సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.

సిగ్నల్ స్ట్రెంత్

Advertisement

జియో సిమ్ కు సంబంధించి ఇండోర్, అవుట్ డోర్ సిగ్నల్ చాలా బాగుంటాయి. అయితే మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు సిగ్నల్ సమస్య తలెత్తవచ్చు. నెట్ వర్క్ సిగ్నలింగ్ పరంగా ఎయిర్ టెల్ ముందంజలో ఉంది. సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ బలమైన సిగ్నల్ ను అందిస్తోంది. వొడాఫొన్ విషయానికి వస్తే.. నగరాల్లో బాగానే ఉంటుంది. పల్లెల్లో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. బీఎస్ఎన్ఎల్ సైతం మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది.

రీఛార్జ్ ప్లాన్స్..

జియో ప్లాన్స్ ఎయిర్ టెల్ తో పోలిస్తే తక్కువ ధరకు లేదా ఎక్కువ బెన్ ఫిట్స్ తో వస్తాయి. అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఎయిర్ టెల్ లో నెట్ వర్క్ క్వాలిటీ, వాయిస్ కాల్ క్లారిటీ బాగా ఉన్నందున రీఛార్జ్ ప్లాన్స్ కాస్త ప్రియంగా ఉంటాయి. అయితే ‘Airtel Thanks’ యాప్ ద్వారా అదనపు ప్రయోజనాలు (డిస్నీ+ హాట్‌స్టార్ వంటివి) లభిస్తాయి. రీఛార్జ్ ఆఫర్స్ పరంగా ఎయిర్ టెల్, జియోతో పోలిస్తే.. విఐ, బీఎస్ఎన్ఎల్ కాస్త చౌకగా ఉంటాయి. అయితే 5G లేకపోవడం, కొన్ని చోట్ల సిగ్నల్ సమస్యలు తలెత్తవచ్చు.

Advertisement

Also Read: Jio Recharge Plan: జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!

ఫైనల్‌గా ఏది బెటర్?

మీకు సూపర్ ఫాస్ట్ 5G ఇంటర్నెట్, బడ్జెట్ ధరలు కావాలంటే Jio ఎంచుకోండి. ధర కొంచెం ఎక్కువైనా పర్లేదు.. నెట్‌వర్క్ స్థిరంగా ఉండాలంటే Airtel ఉత్తమం. మీరు రాత్రిపూట ఎక్కువ డేటా వాడుతుంటే (యూట్యూబ్/మూవీస్) Vi మంచి ఛాయిస్. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలి లేదా కేవలం కాల్స్ కోసం మాత్రమే అయితే BSNL బెస్ట్. అయితే మీ ఏరియాలో ఏ నెట్ వర్క్ చాలా స్ట్రాంగ్ ఉందో ఇరుగు పొరుగు వారిని అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకుంటే నెట్ వర్క్ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.

Also Read: Amazon Coolers offer: రండి బాబు రండి.. ఫ్యాన్ల కంటే చౌకగా కూలర్లు.. ఏకంగా 70% వరకూ తగ్గింపు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×