E-Paper
Advertisement

Jeep Compass Price Cut: ఆగండి.. ఆగండి.. కారు కొనాలని చూస్తున్నారా..? ఈ మోడల్‌పై రూ.1.7 లక్షల భారీ డిస్కౌంట్!

Jeep Compass Price Cut: ఆగండి.. ఆగండి.. కారు కొనాలని చూస్తున్నారా..? ఈ మోడల్‌పై రూ.1.7 లక్షల భారీ డిస్కౌంట్!
Advertisement

Rs 1.7 Lakhs Price Cut on Jeep Compass: భారతీయ ఆటో మార్కెట్‌లో కార్లకు మంచి గిరాకి ఉంటుంది. కొత్త మోడల్ కారు కొనేందుకు వాహన ప్రియులు తరచూ ఆసక్తితో ఉంటారు. ఇక వారిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కంపెనీలు కూడా సేఫ్టీ ఫీచర్లతో సహా ఇతర ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా తమ కార్ సేల్స్ మరింతగా పెరిగేందుకు వివిధ కార్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తాయి. దీంతో తమ కార్ల సేల్స్, బ్రాండింగ్‌ కూడా బాగా జరుగుతుందని కంపెనీలు భావిస్తాయి. అయితే ఇప్పుడు అలాంటిదే ప్రముఖ కార్ అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

ప్రముఖ బ్రాండ్ జీప్ ఇండియా తమ జీప్ కంపాస్ మోడల్ ధరను తాజాగా తగ్గించింది. ఇక్కడొక విషయం ఏంటంటే.. జీప్ సాధారణంగా ధరలను తగ్గించదు.. కానీ ఈ సారి కీలకమైన నిర్ణయం తీసుకొని డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. అయితే జీప్ ఇండియా తగ్గింపు అనేది అన్ని వేరియంట్లకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన వేరియంట్లపైనే ఆఫర్లు అందిస్తుంది. ఇందులో భాగంగానే జీప్ కంపాస్ వేరియంట్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

Advertisement

ఈ జీప్ కంపాస్ అసలు ధర రూ.20.69 లక్షలుగా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై ఏకంగా రూ.1.7 లక్షల తగ్గింపును కంపెనీ అందిస్తోంది. ఈ తగ్గింపుతో జీప్ కంపాస్‌ను రూ. 18.99 లక్షలకు కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ధర తగ్గింపు కేవలం బేస్ మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వేరియంట్లకు కాదు.

Also Read: అద్భుతమైన లుక్‌తో జీప్ 2024 కంపాస్ నైట్ ఈగిల్ లాంచ్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్స్.. ధర..?

Advertisement

జీప్ కంపాస్ బేస్ మోడల్ ఫీచర్ల, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. జీప్ కంపాస్ బేస్ స్పోర్ట్ మోడల్‌లో 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు ఉన్నాయి. జీప్ కంపాస్ రేంజ్ స్పోర్ట్ ట్రిమ్‌తో ప్రారంభమవుతుంది. తర్వాత లాంగిట్యూడ్, నైట్ ఈగిల్, లిమిటెడ్, బ్లాక్ షార్క్, మోడల్ S ట్రిమ్‌లు ఉన్నాయి. ఈ కంపాస్ 2.0-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది 167bhp, 350Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. అందువల్ల సౌకర్యవంతమైన 5-సీటర్ SUV కోసం చూస్తున్న ఎవరికైనా జీప్ కంపాస్ ఒక అద్భుతమైన SUV అని చెప్పుకోవచ్చు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×