E-Paper
Advertisement

2024 Isuzu D-Max V-Cross: ఇసుజు నుంచి కొత్త పికప్ ట్రక్ లాంచ్.. ఇక దుమ్ములేపుడే!

2024 Isuzu D-Max V-Cross: ఇసుజు నుంచి కొత్త పికప్ ట్రక్ లాంచ్.. ఇక దుమ్ములేపుడే!
Advertisement

Isuzu D-Max V-Cross 2024 Launched in India: ఇసుజు 2024 డి-మాక్స్ వి-క్రాస్ జెడ్ ప్రెస్టీజ్ పికప్ ట్రక్కును విడుదల చేసింది. ఇది కంపెనీ పికప్ ట్రక్ పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ మోడల్. ఈ కొత్త V-క్రాస్ ట్రిమ్ అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌లతో తీసుకొచ్చారు. ఈ వెహికల్‌‌ను సేఫ్టీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ. 26.91 లక్షలు ఎక్స్ షో రూమ్‌గా ఉంది. ఇసుజు దీని కోసం బుకింగ్స్‌ను ఇప్పటికే  ప్రారంభించింది. ఈ ట్రక్ ఫీచర్లు, ఇంజన్, డిజైన్ తదితర వాటి గురించి తెలుసుకోండి.

ఇసుజు 2024 డి-మాక్స్ వి-క్రాస్ జెడ్ ప్రెస్టీజ్ పికప్ ట్రక్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్‌తో పాటు, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి V-క్రాస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను తీసుకొచ్చారు. భద్రతకు అధిక ప్రాధాన్యతినిస్తూ మూడు-పాయింట్ల సీటు బెల్ట్‌లు, బ్యాక్ సీటులో ఉండేవారి అలర్ట్‌లు, మూడు వెనుక సీటు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Also Read: డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు

అంతేకాకుండా వెనుక ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుజు వెనుక సీటును ఆనుకునేలా చేసింది. 2024 V-క్రాస్ Z ప్రెస్టీజ్ బయట డిజైన్‌లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. దీని ఫ్రంట్ ఫాసియా, ORVM, రూఫ్ రైల్స్, టెయిల్ లైట్ క్లస్టర్ ఇప్పుడు డార్క్ గ్రే ఫినిషింగ్ ఇందులో చూడొచ్చు.

Advertisement

ఫ్రంట్ బంపర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ డార్క్ గ్రే, మ్యాట్-ఫినిష్ వైట్ కలర్ కాంబినేషన్‌లో వస్తుంది. V-క్రాస్ మునుపటి మాదిరిగానే అదే 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ Apple CarPlay, Android Autoకి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: డ్యూక్‌కు పోటీగా పల్సర్ NS400Z లాంచ్.. ధర ఎంతంటే?

దీని ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటి మాదిరిగానే 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 161bhp పవర్, 360Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో వస్తుంది. ఇది షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై 4WD సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా 2-వీల్-డ్రైవ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×