E-Paper
Advertisement

War Impact Condom Industry: ఇరాన్ యుద్ధం ప్రభావం.. కండోమ్స్‌ తయారీకి కష్టాలు, అలాగైతే

War Impact Condom Industry: ఇరాన్ యుద్ధం ప్రభావం.. కండోమ్స్‌ తయారీకి కష్టాలు, అలాగైతే
Advertisement

War Impact Condom Industry: అమెరికా-ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేస్తున్నా ఇరాన్ ఎందుకు భయపడలేదు? ఇరాన్ కన్నెర్ర చేస్తే ప్రపంచానికి ఇబ్బందులు తప్పవన్న విషయం అగ్రరాజ్యానికి ఆలస్యంగా అర్థమైందా? శాంతి చర్చలని చెబుతున్నా, అలాంటిదేమీ లేదని ఇరాన్ ఎందుకు చెబుతోంది? యుద్ధం పరిస్థితిని అగ్రరాజ్యం ఆలస్యంగా అంచనా వేసిందా? యుద్ధం ప్రభావం క్రమంగా ఒక్కో పరిశ్రమపై పడుతుందా?

ఇరాన్ యుద్ధం ప్రభావం.. కండోమ్స్‌‌కు కష్టాలు

Advertisement

ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచంలో ఒక్కో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కండోమ్స్‌ తయారీ పరిశ్రమకు కష్టాలు మొదలయ్యాయి. కండోమ్‌ల తయారీలో ఉపయోగించే రబ్బరును స్థిరీకరించడానికి అదనపు ప్రొటీన్‌ను తొలగించడానికి అమ్మోనియా చాలా కీలకం. కండోమ్‌లలో సిలికాన్ ఆయిల్‌ని లూబ్రికెంట్‌గా ఉపయోగిస్తారు.

యుద్ధం కారణంగా ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్, పాలీ, రసాయనాలకు తీవ్ర కొరత ఏర్పడింది. సిలికాన్‌ ఆయిల్‌ కొరతతో ఉత్పత్తి తగ్గినట్టు చెబుతున్నాయి. ఇక కండోమ్‌ చిరిగిపోకుండా అమ్మోనియా వాడతారు. గల్ఫ్‌ నుంచే 86 శాతం అమ్మోనియా దిగుమతి అవుతోంది.

Advertisement

ముడి పదార్ధాల కొరత.. కండోమ్స్ ధరలు పెరిగే అవకాశం?

హర్మూజ్‌ మూసివేతతో రవాణా అమాంతంగా ఆగిపోయింది. ఈ విషయాన్ని కండోమ్ తయారీ పరిశ్రమలు చెబుతున్నాయి. దీనివల్ల అమ్మోనియా ధర 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సిలికాన్ ఆయిల్ ధర ఊహ కందని స్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు. ఆయా ముడిపదార్ధాల ధరల ప్రభావం కండోమ్‌లపై పడుతుందని ఆయా  కంపెనీలు చెబుతున్నాయి.

ఇక ఇండియా విషయానికి వద్దాం. దేశ కండోమ్ మార్కెట్ విలువ 1.7 బిలియన్ డాలర్లని ఓ అంచనా. కండోమ్‌ల తయారీకి అవసరమైన ముడిపదార్ధం అనగా అనహైడ్రస్ అమోనియా, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్‌ల నుండి దిగుమతి కావాలి. ముడి పదార్థాల కొరత కారణంగావాటి ధరలు పెరిగే అవకాశం ఉందని తయారీ సంస్థలు చెబుతున్నమాట.

ALSO READ: రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు 

కండోమ్‌ల ధర పెరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ధర పెరగడంతో వాటిని కొనడానికి ప్రజలు సంకోచిస్తారు. ఫలితంగా లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో కండోమ్స్ తయారీ చేసే నాలుగు తయారీ పరిశ్రమలు ఉన్నాయి.

ఆ ప్రాంతంలో 10 కోట్ల వరకు కండోమ్స్ తయారు అవుతాయి. యుద్ధం నేపథ్యంలో సిలికాన్ ఆయిల్, అల్యూమినియం ఫాయిల్, అమ్మోనియా తగినంత ముడి పదార్ధాలు లభించకపోవడంతో వాటి ఉత్పత్తి తగ్గిపోయిందని  అంటున్నారు తయారీ దారులు. తగినంత ముడి సరకు పొందడంలో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నాయి. దీనిపై తయారీ కంపెనీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×