E-Paper
Advertisement

ఇరాన్ చమురు నౌక రూట్ మార్చింది.. ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు..

ఇరాన్ చమురు నౌక రూట్ మార్చింది.. ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు..
Advertisement

Iran Crude Oil India Import: అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో సంచలనం నమోదైంది. సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఇరాన్ నుండి భారత్‌కు ముడిచమురు దిగుమతులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి చైనా వైపు వెళ్తున్న ఒక భారీ ఇరాన్ చమురు నౌక, అనూహ్యంగా తన రూటు మార్చి భారత తీరానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఏడేళ్ల విరామం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

జయ అనే భారీ చమురు నౌక ఇరాన్ ముడిచమురుతో భారత్ తూర్పు తీరానికి చేరుకుంటోంది. తొలుత ఈ నౌక ఆగ్నేయాసియా మీదుగా చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ మధ్యలో తన దిశను మార్చుకుని భారత్ వైపు మళ్లింది. ఈ చమురు నిల్వలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు జోర్డాన్ అనే మరో నౌక కూడా భారత్ వైపు వస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

Advertisement

భారత్ చివరిసారిగా మే 2019లో ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకుంది. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా భారత్ ఈ కొనుగోలును నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటి నుండి భారతీయ రిఫైనరీలు రష్యా, అమెరికా.. ఇతర పశ్చిమాసియా దేశాలపై ఆధారపడ్డాయి. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఏర్పడిన సరఫరా అంతరాయాల దృష్ట్యా, ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకు అమెరికా తాత్కాలికంగా ఇరాన్ ఆంక్షలను సడలించింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ కొనుగోలు ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే జరిగినట్లు తెలుస్తోంది.  ఇరాన్ సాధారణంగా తక్కువ ధరకే, అనుకూలమైన నిబంధనలతో చమురును విక్రయిస్తుంది. చెల్లింపుల విషయంలో కూడా ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని కేంద్ర పెట్రోలియం శాఖ గత వారమే ధృవీకరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ దిగుమతులు భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం కానున్నాయి. ఇరాన్ నుండి చమురు దిగుమతులు పునరుద్ధరించడం వల్ల భారతీయ రిఫైనరీలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.

Advertisement

Read Also: అదృష్టమంటే ఇతనిదే.. ఇరాక్ దాడి నుంచి ప్రాణాలతో తృటిలో తప్పించుకున్న తెలంగాణ వాసి!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×