E-Paper
Advertisement

Investing Tips: రూ. 4,700 సేవింగ్‎తో రూ. 4 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

Investing Tips: రూ. 4,700 సేవింగ్‎తో రూ. 4 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
Advertisement

Investing Tips: కోటీశ్వరులు కావాలని అనేక మంది ఆశిస్తుంటారు. కానీ అనేక మంది చాలా కష్టమని భావిస్తుంటారు. కానీ మీరు చిన్న చిన్న సేవింగ్స్ చేయడం ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు. సరైన ప్రణాళిక, కృషి, స్థిరమైన ఆదాయంతో సేవింగ్స్ చేస్తే ఈజీగా మిలియనీర్ అవ్వొచ్చు. మీరు కేవలం సంపాదనపై మాత్రమే కాకుండా, సంపదను సురక్షితంగా పెట్టుబడులు చేయడం ద్వారా దీర్ఘ కాలంలో పెద్ద మొత్తాలను పొందవచ్చు. అందుకోసం మీ ఆదాయ వనరులను సరిగ్గా విస్తరించుకోవాలి.

నెలకు రూ. 4700..

మీరు మంచి మొత్తాలను దక్కించుకోవాలంటే, సరైన వ్యూహాలను అమలు చేస్తూ, మీ లక్ష్యం కోసం ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ క్రమంలో సరైన మార్గదర్శకాలు పాటిస్తూ, నిబద్ధతతో మీరు కృషి చేస్తే ఎవరైనా కూడా సులభంగా కోటీశ్వరులు కావచ్చు. అయితే ఇక్కడ కేవలం కోటీ రూపాయల గురించి మాత్రమే కాదు. మీరు కేవలం రూ. 4700 నెలకు సేవ్ చేయడం ద్వారా, కొన్నేళ్ల వ్యవధిలో రూ. 4 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అవును మీరు చదివింది నిజమే. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్నేళ్లు పెట్టుబడి చేయాలి

Advertisement

మీరు 4 కోట్ల రూపాయల మొత్తం కోసం దీర్ఘకాలంలో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. అందుకోసం మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడులు (Systematic Investment Plan) మంచి ఎంపికగా ఉంటాయి. ఈ క్రమంలో మీరు ప్రతి నెలకు రూ. 4,700 సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఆ క్రమంలో మీరు 33 సంవత్సరాలపాటు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా 33 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 4,04,67,951. అంటే ఇక్కడ మీరు చేసే పెట్టుబడి కేవలం రూ. 18,61,200 మాత్రమే. కానీ మీకు మాత్రం వడ్డీ రూపంలోనే రూ. 3,86,06,751 లభిస్తాయి. 33 ఏళ్ల కాలంలో మీరు 15% వార్షిక వడ్డీతో మీ పెట్టుబడులు క్రమంగా పెరిగి 4 కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. సాధారణంగా సిప్ విధానంలో వార్షిక రాబడులు 12 నుంచి 19 శాతం వరకు లభిస్తున్నాయి.

Read Also: Investment Tips: రోజు జస్ట్ రూ. 100 సేవింగ్.. కోటి రూపాయల రాబడి, ఎలాగంటే..

ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి

Advertisement

అయితే ఈ పెట్టుబడులను మీరు ఉద్యోగంలో చేరిన తక్కువ వయస్సులోనే ప్రారంభించుకుంటే, దీర్ఘకాలంలో భారీ మొత్తాలను దక్కించుకోవచ్చు. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయస్సులో ఈ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 58 సంవత్సరాలు వచ్చే సరికి మీకు 4 కోట్ల రూపాయలు అందుతాయి. ఆ మొత్తాలను మీ పిల్లల పెళ్లి లేదా ఇంటి కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

మార్కెట్ నష్టాల్లో ఉంటే..

సిప్‌లో పెట్టుబడులను మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నప్పుడు చేస్తే ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. ఆ క్రమంలో తర్వాత మార్కెట్ స్థితి పెరిగితే మీరు చేసిన పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు నిరంతరం సిప్ వంటి సమర్థవంతమైన పెట్టుబడులు మీకు భారీ మొత్తాలను అందిస్తాయి.

గమనిక: స్టాక్ మార్కెట్లో లేదా మ్యాచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు చేయాలని బిగ్ టీవీ సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. ఈ పెట్టుబడులపై మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తప్పక తీసుకోవాలి.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×