E-Paper
Advertisement

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!
Advertisement

SIP Investment: పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 3 లక్షలు సంపాదన పొందాలనుకుంటున్నారా? అయితే SIPలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. SIPలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో రిటర్న్స్ పొందవచ్చు. మీ రిటర్మెంట్ లైఫ్ సాఫీగా సాగిపోయేందుకు ముందస్తు ప్రణాళిక అవసరం. అందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్ నిపుణులు ఓ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నారు. SIPలలో ఎంతో జాగ్రత్తగా, క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే జీవితాంతం ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు.

SIP వ్యూహాం

ఉదాహరణకు 35 ఏళ్ల వైద్యుడు SIPలో పెట్టుబడి వ్యూహాన్ని నిపుణులు ఇలా వివరించారు. SIPలో నెలకు రూ. 75,000 పెట్టుబడి పెట్టగలిగి.. 8 శాతం వార్షిక స్టెప్-అప్ తో 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే వార్షిక కాంపౌండ్ గ్రోత్ రేట్ 11 శాతంగా ఉంటే రూ. 10.5 కోట్లు జమ అవుతుంది. ఇందులో 5 శాతం సిస్టమేటిక్ విత్ డ్రా ప్లాన్ ఎంచుకుంటే పదవీ విరమణ తర్వాత నెలకు రూ.3 లక్షలు పొందుతారు.

  • 35 ఏళ్ల డాక్టర్ క్లయింట్
  • SIP నెలకు రూ. 75,000
  • స్టెప్-అప్ – ఏడాదికి 8%
  • పెట్టుబడి పదవీకాలం-20 సంవత్సరాలు
  • రాబడి – 11% కాంపౌండ్ గ్రోత్ రేట్
  • ఫైనల్ కార్పస్ -రూ. 10.5 కోట్లు
  • పదవీ విరమణ తర్వాత 5 శాతం చొప్పున విత్ డ్రా చేసుకుంటే నెలకు రూ.3 లక్షలు వస్తుంది.
Advertisement

Also Read: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు

విత్ డ్రాకు ఓ ప్లాన్

SIPలో స్థిరంగా పెట్టుబడి పెట్టడం ద్వారా కార్పస్ మొత్తం పెరిగి పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రశాంతత లభిస్తుందని పెట్టుబడి నిపుణులు చెబుతున్నారు. మీ ఆదాయాన్ని కాలక్రమేణా పెరిగే ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ పెట్టుబడులపై వచ్చే చక్రవడ్డీతో సంపద మరింత పెరుగుతుంది. పదవీ విరమణ తర్వాత డబ్బును జాగ్రత్తగా ఉపసంహరించుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు. దీర్ఘకాలం ఆ డబ్బును వినియోగించుకునేలా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. పెట్టుబడి పెట్టండి → వృద్ధి చేసుకోండి → క్రమంగా ఉపసంహరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Disclaimer: ఈ ఆర్టికల్ లో సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×