E-Paper
Advertisement

Women Day Special: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళలకు ఆ బ్యాంకు ప్రత్యేక ఆఫర్

Women Day Special: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళలకు ఆ బ్యాంకు ప్రత్యేక ఆఫర్
Advertisement

Women Day Special: ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మలచుకుంటాయి కొన్ని సంస్థలు. దీనివల్ల కస్టమర్స్‌ని ఆకట్టుకునే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ విషయంలో ఆ బ్యాంకు ఓ అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యెస్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేక వేతన ఖాతాను తీసుకొచ్చింది. అంతేకాదు ఉచితంగా లాకర్‌తోపాటు ఉచిత ఆరోగ్య బీమా కూడా ఇవ్వనుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు

Advertisement

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక, జీవనశైలి అవసరాలకు తగినట్టుగా కీలక నిర్ణయం తీసుకుంది యెస్ బ్యాంక్. వారి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి ప్రయోజనాల సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చింది. ఉమెన్స్‌ శాలరీ అకౌంట్‌లో తొలి ఏడాది ఉచిత లాకర్‌ సౌకర్యం కల్పించింది.

అంతేకాదు ఏడాదిపాటు రూ. 5 లక్షల కాంప్లిమెంటరీ హెల్త్‌ కవర్ ఉండనుంది. ఏడాదికి ఒకసారి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసుకోవచ్చు. వీటితోపాటు కస్టమర్లు కాంప్లిమెంటరీ ఎలిగెన్స్‌ డెబిట్‌ కార్డు పొందవచ్చు. ఎంపిక చేసిన విభాగాల్లో ఐదు శాతం క్యాష్‌ బ్యాక్‌ ఉంటుంది. ఏటా రూ.6,000 వరకు పొందొచ్చన్నమాట.

Advertisement

మహిళలకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చిన యెస్ బ్యాంక్

గతవారం యెస్ బ్యాంక్ కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులకు సంబంధించిన రూ.2.5 కోట్లకు విలువైన అనధికార లావాదేవీలను గుర్తించింది. Book My Forex భాగస్వామ్యంతో జారీ చేయబడిన మల్టీ-కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్ ద్వారా జరిగినట్టు తేలింది. ఈ అనధికార లావాదేవీలు BIN నెంబర్లపై లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలు ఫిబ్రవరి 24, 2026న లాటిన్ అమెరికాకు చెందిన 15 మంది వ్యాపారులపై జరిగాయని తెలిపింది.

ఇక ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు 500 మిలియన్‌ డాలర్ల సామాజిక రుణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దాదాపు రూ.4,590 కోట్లుతో ప్రారంభంచింది. లింగ వివక్షను తగ్గించేందుకు అభివృద్ధి లక్ష్యం సాధించేందుకు ఇది దోహదం చేయనుంది. పర్యావరణం, సామాజిక, పాలన సూత్రాలపై బ్యాంకుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జెండర్‌-థీమ్‌ రుణంగా పేర్కొంటున్న ఈ పథకం ఆర్థిక వృద్ధి, సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు ఉద్దేశించింది.

ALSO READ:  బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×