E-Paper
Advertisement

India Revises Baggage Rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త బ్యాగేజీ రూల్స్.. మహిళలకు 40 గ్రా. పురుషులకు 20 గ్రామ్స్

India Revises Baggage Rules: ప్రయాణికులకు అలర్ట్.. కొత్త బ్యాగేజీ రూల్స్.. మహిళలకు 40 గ్రా. పురుషులకు 20 గ్రామ్స్
Advertisement

India Revises Baggage Rules: విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తీపి కబురు. విదేశాల నుండి వచ్చేవారు మహిళలు 40 గ్రాముల బంగారు ఆభరణాలను, పురుషుడు 20 గ్రాములను సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఇదొక శుభవార్త.

ట్రావెలర్స్‌కి నేటి నుంచి కేంద్రం కొత్త రూల్స్

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో దేశంలోకి మరింత బంగారం అందుబాటులోకి రానుంది. ఒకప్పుడున్న రూల్స్‌ని కాస్త సవరించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే భారతీయులకు ఊహించని రిలీఫ్. కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ఏయే వస్తువులు ఎంత వరకు తెచ్చుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్యాగేజీ రూల్స్ నేటి నుంచి (ఫిబ్రవరి 2-2026) నుంచి అమల్లోకి వచ్చాయి. విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులకు చల్లటి కబురు చెప్పింది. మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తులకు మాత్రమే ఈ రూల్స్ కింద బంగారం తీసుకునిరావచ్చు.

Advertisement

ఉమెన్ 40 గ్రా.. మెన్  20 గ్రాముల బంగారం తేవచ్చు

ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా పైన పేర్కొన్న బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు. కేవలం మీ సొంత వాడకానికి తెచ్చుకునే ఆభరణాలకు వర్తిస్తుందని పేర్కొంది. అదే బంగారం బిస్కెట్లు, అమ్మడానికి తెచ్చే గోల్డ్ దీని పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది.  ఈ విషయాన్ని కేంద్ర పరోక్ష పన్నులు- కస్టమ్స్‌ బోర్డు-సీబీఐసీ వెల్లడించింది.

గతంలో మహిళలు లక్ష రూపాయలు విలువ చేసే ఆభరణాలు, పురుషులు 50 వేల విలువైన ఆభరణాలు తెచ్చేవారు. దీనివల్ల మరింత బంగారం భారతీయులకు అందుబాటులోకి రావచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల దేశీయంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ: యూపీఐ యాప్ లో వేరే ఖాతాకు డబ్బులు కొట్టేశారా?.. ఇలా చేస్తే తిరిగొస్తాయ్

దీనికితోడు వస్తువుల లిమిట్ పెంచింది. విదేశాల నుంచి వచ్చేవారు 75 వేల విలువైన వస్తువులను కస్టమ్స్ డ్యూటీ లేకుండా తేవచ్చు. గతంలో ఇది 50 వేల రూపాయలు మాత్రమే ఉండేది. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు మినహాయింపు అస్సలు పనికిరాదు. ​ఫారిన్ టూరిస్టులు తమ సొంత అవసరాల కోసం రూ. 25,000 విలువైన వస్తువులను వెంట తెచ్చుకోవచ్చు. ​18 ఏళ్లు నిండిన ప్రయాణికులు ఎవరైనా సరే పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ని తమ వెంట తెచ్చుకోవచ్చు. ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకొచ్చే పాత వస్తువులు దుస్తులు, ఇతర పరికరాలు ఎలాంటి సుంకం ఉండదు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×