E-Paper
Advertisement

రోజుకు 89 మంది కుబేరులు.. అల్ట్రా రిచ్ లిస్ట్ లో భారత్ ఎన్నో స్థానమంటే?

రోజుకు 89 మంది కుబేరులు.. అల్ట్రా రిచ్ లిస్ట్ లో భారత్ ఎన్నో స్థానమంటే?
Advertisement

Ultra Rich List: టెక్నాలజీ, క్యాపిటల్ మార్కెటింగ్, ఇండస్ట్రీస్ తో పాటు పలు రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల జాబితా పెరుగుతోంది. గత ఐదేళ్లలో రోజుకు 89 మంది అల్ట్రా రిచ్ జాబితాలో చేరుకున్నారు. నైట్ ఫ్రాంక్ ‘వెల్త్ రిపోర్ట్ 2026’ ప్రకారం.. ప్రపంచ రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్నా.. సంపద సృష్టి పెరుగుతుంది. భారత్ లో కూడా సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 51 శాతం పెరుగుతుందని అంచనా.

పెరుగుతున్న అల్ట్రా రిచ్ లిస్ట్

వెల్త్ రిపోర్ట్ 2026 ప్రకారం.. 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదతో 2,50,000 మందికి పైగా సంపన్నులతో యూఎస్ అగ్ర గమ్యస్థానంగా ఉంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే యూఎస్ చాలా ముందుంది. యూఎస్‌లో 2,51,352 మంది అత్యంత సంపన్నులు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 1,21,677 మందితో చైనా నిలించింది. ఆ తర్వాతి స్థానాల్లో యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు జర్మనీ (38,215), యూకే (27,876), ఫ్రాన్స్ (21,518) ఉన్నాయి. 19,877 మంది సంపన్నులతో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.

Advertisement

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా రిచ్ సంపన్నుల సంఖ్య భారీగా పెరిగింది. 2021-2026 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యధిక సంపన్నుల (UHNWI) జనాభా 5,51,435 నుంచి 7,13,626కు పెరిగిందని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట, ప్రతిరోజూ 89 మంది 30 మిలియన్ డాలర్ల ఆదాయం మార్కును దాటుతున్నారు.

అమెరికా అగ్రస్థానంలో.. భారత్ ఆరో స్థానంలో

కుబేరులు జాబితాలో అమెరికా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది. గత ఐదేళ్లలో అత్యధిక సంపన్నులు 41% మంది అమెరికాలోనే ఉన్నారని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ప్రపంచ అత్యధిక సంపన్నులలో అమెరికా వాటా కూడా పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అతి సంపన్న జనాభా కలిగిన 10 దేశాలు

Advertisement

1. అమెరికా- 2,51,352
2. చైనా – 1,21,677
3. జర్మనీ -38,215
4. యునైటెడ్ కింగ్‌డమ్- 27,876
5. ఫ్రాన్స్- 21,518
6. భారత్- 19,877
7. జపాన్- 18,914
8. స్విట్జర్లాండ్ -17,692
9. ఆస్ట్రేలియా- 16,460
10. ఇటలీ- 15,433

అతి సంపన్నుల జాబితాలో చైనా రెండో స్థానంలో నిలిచింది. అయితే భారతదేశం ఒక కీలక వృద్ధి సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉన్న భారత్ లో అల్ట్రా రిచ్ సంపన్నులు వేగంగా పెరుగుతున్నారు. దేశంలోని అత్యంత సంపన్నుల జనాభా 2021లో 12,000 ఉండగా, 2026 నాటికి దాదాపు 20,000కు చేరింది.

Also Read: ధోని, కోహ్లీ, రోహిత్ ఎవ‌రూ కాదు..ఐపీఎల్ లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రంటే

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×