E-Paper
Advertisement

భారత్-న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. MSME లకు బిగ్ బూస్ట్

భారత్-న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. MSME లకు బిగ్ బూస్ట్
Advertisement

India NZ FTA: ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక ప్రయాణంలో నిర్ణయాత్మక మైలురాయిగా పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఈ ఒప్పందం తొమ్మిది నెలల్లోనే కుదిరిందని, ఇరు దేశాల పరస్పర విశ్వాసం, ఉమ్మడి లక్ష్యాలను ప్రతిబింబిస్తుందని ఆయన తెలియజేశారు.

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ముఖ్య విషయాలు

Advertisement

ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 100% సుంకాల మినహాయింపు ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూనే, ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మహిళలు, యువత, నిపుణులు, వివిధ రంగాలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం దేశంలోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేస్తుందన్నారు. వాణిజ్యం, సేవలు, పెట్టుబడి, ఆవిష్కరణ, రవాణా, వ్యవసాయ, విద్య రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందన్నారు.

ఈ అగ్రిమెంట్ అన్ని టారిఫ్ లైన్‌లను కవర్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. వస్త్రాలు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఫుడ్ రంగాలలో పోటీతత్వాన్ని పెంచి ఎంఎస్‌ఎంఈలకు ఊతం ఇస్తాయన్నారు. న్యూజిలాండ్ గతంలో సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా కీలకమైన భారతీయ ఎగుమతులపై 10 శాతం వరకు గరిష్ట సుంకాలను కొనసాగించిన విషయం తెలిసిందే.

Advertisement

భారత్ లో తయారీ రంగానికి అవసరమైన కలప, కోకింగ్ బొగ్గు, స్క్రాప్, వివిధ ముడిసరుకులకు సుంకల మినహాయింపు లభించనుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి భారత పరిశ్రమలు ప్రపంచ పరిశ్రమలతో పోటీపడనున్నాయి. మరోవైపు, భారత్ లోని సున్నితమైన రంగాలను పరిరక్షించడానికి 29.97% సుంకాల లిమిట్స్ ను మినహాయించారు. ద్వైపాక్షిక వాణిజ్య విలువలో 95% వాటా కలిగిన ఉత్పత్తులకు సుంకాలను మినహాయింపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

మినహాయింపు జాబితాలోని ఉత్పత్తులు

  • పాల ఉత్పత్తులు (పాలు, మీగడ, మజ్జిగ, పెరుగు, జున్ను)
  • జంతు ఉత్పత్తులు (గొర్రె మాంసం),
  • వ్యవసాయ ఉత్పత్తులు (ఉల్లిపాయలు, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం),
  • చక్కెర, కృత్రిమ తేనె, జంతు కొవ్వులు, నూనెలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రత్నాలు, ఆభరణాలు,
  • రాగి ఉత్పత్తులు (కాథోడ్‌లు, కాట్రిడ్జ్‌లు, రాడ్‌లు, బార్‌లు, కాయిల్స్),
  • అల్యూమినియం వస్తువులు (ఇంగోట్‌లు, బిల్లెట్‌లు, వైర్ బార్‌లు)

Also Read: వాణిజ్య ఒప్పందంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్.. విదేశీ కంపెనీలకే ప్రాధాన్యమా?

న్యూజిలాండ్ ఉత్పత్తులు

కలప, ఉన్ని, గొర్రె మాంసం, తోలు వంటి వస్తువులపై భారత్ గతంలో 30 శాతం సుంకాలు విధించేది. ఈ సుంకాలను ప్రస్తుత ఒప్పందంలో తొలగించనుంది. అదేవిధంగా, పెట్రోలియం, మాల్ట్ ఎక్స్‌ట్రాక్ట్, వెజిటేబుల్ ఆయిల్స్, విద్యుత్, యాత్ర పరికరాలు, పెప్టోన్‌లతో సహా 35.60 శాతం టారిఫ్ లైన్‌లపై 3, 5, 7, 10 సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా సుంకం తొలగించనున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×