E-Paper
Advertisement

India Fancy Number: ఇండియాలో అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్.. HR 88B-8888, ఎంతో తెలుసా?

India Fancy Number: ఇండియాలో అత్యంత  ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్..  HR 88B-8888, ఎంతో తెలుసా?
Advertisement

India Fancy Number: వాహనాలు కొనేటప్పుడు వాహనదారుడు రకరకాలుగా ఆలోచన చేస్తాడు. ఆ ఫీచరుంటే బాగుండేదని భావిస్తుంటాడు. లేకుంటే ధర ఇంకాస్త తగ్గినా బాగుండేదని ఆలోచన చేస్తాడు. ఇంతలా ఆలోచించిన సగటు వాహనదారుడు, నెంబర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడు. ఎంతైనా పెట్టి కొనుగోలు చేసేందుకు ఉవ్విల్లూరుతుంటాడు. అలాంటిదే ఒకటి జరిగింది. HR 88B-8888 ఇండియాలో అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్‌గా నిలిచింది. ఇంతకీ ఎక్కడ? ఏంటి? అనే విషయాల్లోకి లోతుగా వెళ్లొద్దాం.

ఇండియాలో అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్

Advertisement

వాహనాల ఫ్యాన్సీ నెంబర్లు ధర రికార్డులు బద్దలవుతుంటాయి. ఒక్కో రాష్ట్రాల్లో ఒక్కోలా ఉంటుంది. ఫలానా నెంబర్ ఉంటే తమకు కలిసి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ధర ఎంతైన పెట్టి కొనుగోలు చేసేందుకు తహతహలాడుతుంటారు. దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్ గా మారింది HR88B 8888 నెంబర్. బుధవారం హర్యానా ప్రభుత్వం వీఐపీ ఫ్యాన్సీ నెంబర్ ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. అందులో HR 88B 8888 ఫ్యాన్సీ నెంబర్ అక్షరాలా రూ. 1.17 కోట్లకు అమ్ముడుపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో అత్యంత ఖరీదైన నెంబర్ కూడా ఇదేనన్నమాట.

ఆన్‌లైన్ వేలంలో 45 మంది వినియోగదారులు పాల్గొన్నారు. బేస్ ప్రైస్ రూ. 50 వేలతో మొదలైంది. సాయంత్రం వేలం ముగిసేసరికి HR88B 8888 నెంబర్ రూ. 1.17 కోట్ల వద్ద ముగిసింది. భివానీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బిజినెస్‌మేన్ ఈ ఫ్యాన్సీ నెంబర్‌ని దక్కించుకున్నాడు. ఆయనకు ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం, టెక్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సదరు వ్యాపారవేత్త ఆ నెంబర్‌కి సంబంధించి ఎలాంటి వాహనం కొనుగోలు చేయలేదు. ముందుగానే కోట్లాది రూపాయలు పెట్టి మరీ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడం విశేషం. చాలామంది ఆయా నెంబర్లను కావాల్సిన వారిని భారీగా విక్రయించిన సందర్భాలు ఉన్నాయని ట్రాన్స్‌ఫోర్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఈ ఫ్యాన్సీ నెంబర్ HR 88B-8888 కోటి 17 లక్షలు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం వాహనాలకు సంబంధించి వీఐపీ, ఫ్యాన్సీ నెంబర్లను ఆన్‌లైన్ ఆక్షన్ నిర్వహిస్తుంది. ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నమోదు ప్రక్రియ మొదలై, సోమవారం ఉదయం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 5 గంటలకు వేలానికి సంబంధించి ఫలితాలు వెల్లడిస్తారు అధికారులు. గత వారం HR22W 2222 ఫ్యాన్సీ నెంబర్ దాదాపు రూ 38 లక్షలకు వెళ్లింది. తాజాగా HR88B 8888 నెంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా పలికింది. మొత్తానికి ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా సంబంధిత ట్రాన్స్‌పోర్టు శాఖకు ఆదాయం ఈ విధంగా కూడా వస్తోందన్నమాట.

ALSO READ: ల్యాప్ టాప్ కు ఛార్జింగ్ గంటల తరబడి పెడుతున్నారా? 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×