E-Paper
Advertisement

ఇంధన సంక్షోభం.. భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతమే.. ఎస్&పీ అంచనా

ఇంధన సంక్షోభం.. భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతమే.. ఎస్&పీ అంచనా
Advertisement

India GDP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటును ఎస్& పీ గ్లోబల్, క్రిసిల్ ఇండియా ఫార్వర్డ్ అంచనా వేసింది. పశ్చిమ ఆసియాలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపించడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.6 శాతానికి తగ్గనుంది . దేశీయంగా మౌలిక అంశాలు బలంగా ఉన్నప్పటికీ, ఇంధన సంక్షోభంతో స్థూల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది. దీంతో మునుపటి అంచనాలను క్రెడిట్ సంస్థలు తగ్గించాయి.

ద్రవ్యోల్బణం ఒత్తిడి

భారతదేశ వృద్ధి రేటు ఈ ఏడాది ప్రారంభంలోని 7.1 శాతం అంచనా వేశారు. గతంలో నమోదైన 7.6 శాతం వృద్ధి కంటే ఈ అంచనా తక్కువ. పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు, ఇంధన సరఫరా అంతరాయాలు ఆర్థిక వేగాన్ని మందగించేలా చేశాయని విశ్లేషకులు చెప్తున్నారు. 2023 నుంచి 2026 మధ్య భారత్ వార్షిక జీడీపీ 7.3 శాతంగా నమోదు చేసుకుంది. అదే సమయంలో, పెరిగిన ఇంధనం, రవాణా, ముడిసరుకుల ఖర్చులతో ద్రవ్యోల్భణం 2 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నప్పటికీ, ఇంధన ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

కీలక సంస్కరణలు అవసరం

Advertisement

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు కీలకమని ఎస్ అండ్ పీ తెలిపింది. ఇండియా ఫార్వర్డ్‌ నివేదికలో.. ఇంధన సరఫరాలో అంతరాయాలు, పెరుగుతున్న చమురు, గ్యాస్‌ ధరలు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులతో భారత్‌ తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను గురవుతుందని క్రిసిల్‌ తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే.. ఖరీఫ్ పంటలకు ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఈయూ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను పొందాలంటే భారత్‌ మరిన్ని సంస్కరణలు చేపట్టాలని నిపుణులు సూచించారు.

Also Read: దూసుకుపోతున్న భారత్ జిడిపీ.. సంతోషించాల్సిన విషయం కాదు.. నిపుణుల హెచ్చరిక

ఏడీబీ అంచనా

Advertisement

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 0.6 శాతం మేర తగ్గి 6.3 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని ఏడీబీ అంచనా వేశారు. చమురు, గ్యాస్‌ దిగుమతులపై భారత్‌ అధికంగా ఆధారపడుతుండడంతో.. ద్రవ్యోల్బణం పెరగొచ్చని పేర్కొన్నారు. 2026-27లో ద్రవ్యోల్బణం 2.4 శాతం మేర పెరిగి 6.9 శాతానికి చేరుతుందన్నారు. అయితే వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×