E-Paper
Advertisement

India Fourth Largest Economy: ఆ విషయంలో జపాన్‌ను మించిపోయిన ఇండియా.. ఇది కదా మనకు కావాల్సింది!

India Fourth Largest Economy: ఆ విషయంలో జపాన్‌ను మించిపోయిన ఇండియా.. ఇది కదా మనకు కావాల్సింది!
Advertisement

India Fourth Largest Economy: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సమీక్ష ప్రకారం.. నామినల్ జీడీపీ పరంగా భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పుడు అమెరికా, చైనా, జర్మనీల తర్వాత స్థానంలో నిలిచింది. ప్రస్తుత ట్రెండ్‌లు అలాగే కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైనల్ జీడీపీ డేటా విడుదలైన తర్వాత, 2026లో భారత్ ర్యాంకింగ్ ఖరారుకానుంది.

2030 నాటికి మూడో స్థానానికి

ప్రస్తుతం 4.18 ట్రిలియన్ల యూఎస్ డాలర్ల జీడీపీతో.. భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటికి 7.3 ట్రిలియన్ల యూఎస్ డాలర్ల జీడీపీతో రాబోయే 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీ అధిగమించి మూడో స్థానానికి ఎగబాకే అవకాశం ఉందని ఫెడరల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర జీడీపీ 8.2 శాతం పెరిగిందని పేర్కొంది. ఇది మొదటి త్రైమాసికంలో 7.8 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 7.4 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఎగుమతుల ఊతం

Advertisement

యూఎస్ భారీ సుంకాలు, ఎగుమతులు మందగించిన నేపథ్యంలో దేశీయ డిమాండ్ పెరుగుదలకు కారణమైందని ఆర్థిక నిపుణులు తెలిపారు. భారత్ ఎగుమతి పనితీరు క్రమంగా మెరుగుపడుతోందన్నారు. ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తుల్లో వృద్ధి కనిపిస్తుందన్నారు. 2025 జనవరిలో 36.43 బిలియన్ డాలర్ల నుంచి నవంబర్‌లో 38.13 బిలియన్ల డాలర్ల ఎగుమతులు పెరిగాయని తెలిపారు.

2026లో భారత్ వృద్ధి రేటు అంచనాలు

2026లో భారత్ 6.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2026లో 6.4 శాతం, 2027లో 6.5 శాతం వృద్ధి రేటుతో G20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని మూడీస్ అంచనా వేస్తోంది. ఐఎంఎఫ్ తన అంచనాలను 2025లో 6.6 శాతం, 2026లో 6.2 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని సవరించింది. స్టాండర్ట్&పూర్ 2025లో 6.5 శాతం, 2026లో 6.7 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు 2025 అంచనాను 7.2 శాతానికి పెంచింది. ఫిచ్ తన అంచనాలను 2026కు 7.4 శాతానికి పెంచింది.

Advertisement

Also Read: జపాన్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మ‌న‌దే!

అయితే ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతం అంచనా వేసింది. మూడేళ్లలో భారత్ వృద్ధి రేటులో జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని నీతి ఆయోగ్ తెలిపింది.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×