E-Paper
Advertisement

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..  20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు
Advertisement

Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక. 20 వేల మందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఐటీ శాఖ. పన్నులు తగ్గించుకునేందుకు వేర్వేరు మార్గాల్లో ట్రిక్స్ ప్లే చేసిన వారిని  గుర్తించింది. రేపో మాపో 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్

Advertisement

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సూచన. 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు నోటీసులు ఇచ్చేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి ఆదాయపు పన్ను రిటర్నుల్లో తప్పుడు సమాచారం, ఒక క్లెయిమ్ స్థానంలో మరొకటి మార్చి చూపిస్తున్న ట్యాక్స్ పేయర్లపై నిఘా పెట్టింది ఆ శాఖ.

అధునాతన టెక్నాలజీ ద్వారా సుమారు 20 వేల మంది గుర్తించింది. వారంతా అక్రమ మార్గాలను ఎంచుకున్నట్లు తేలింది. నకిలీ క్లెయిమ్స్ ద్వారా పన్ను ఎగవేసే వారి వివరాలపై కంపెనీల యాజమాన్యాలను సంప్రదిస్తోంది ఐటీ శాఖ. రేపో మాపో వారందరికీ నోటీసులు జారీ చేయనుంది ఐటీ విభాగం.

Advertisement

 20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ నోటీసులు

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు ఒక పన్ను ప్రయోజనాన్ని ఉపసంహరించుకుని, మరొక ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసిన సందర్భాలను గుర్తించారు అధికారులు. దీన్ని స్వాపింగ్ గా చెబుతారు. ఎగ్జాంపుల్ కొంతమంది తమ అసలు ఐటీఆర్‌లో ఇంటి అద్దెను క్లెయిమ్ చేస్తారు.

ఐటీ శాఖ తనిఖీ చేస్తుందనే భయంతో రివైజ్డ్ ఐటీఆర్‌లో క్లెయిమ్ తగ్గిస్తారు. దాని స్థానంలో సెక్షన్ 10 (14) కింద వచ్చే కన్వేయన్, ఎడ్యుకేషన్, హిల్ ఏరియా అలవెన్సులను క్లెయిమ్ చేస్తుంటారు. కొందరు ఒరిజినల్ ఐటీఆర్ లో పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన విరాళాలను క్లెయిమ్ చేసి అప్డేటెడ్ రిటర్నుల్లో వాటిని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విరాళాలుగా మారుస్తారు. ఒక దానితో మరొకటి మార్చడం ముమ్మాటికీ చట్ట విరుద్ధం.

ALSO READ:  ఆన్‌లైన్ మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం, ఆర్‌బిఐ ఏం చెబుతోంది?

సుమారు రూ.50 వేల నుంచి లక్ష కంటే ఎక్కువ మొత్తంలో తప్పుడు రీఫండ్లు, క్లెయిమ్ లు పొందిన వారిని ఐటీ శాఖ టార్గెట్ చేసింది. ఈ విషయంలో ట్యాక్స్ పేయర్లకు ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. నడ్జ్-Nudge ప్రచారం ద్వారా ట్యాక్స్ పేయర్లు తమ తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపింది. స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది కూడా.

ఆదాయపు పన్ను చట్టంలో నకిలీ క్లెయిమ్‌లు చూపిస్తే దాన్ని పన్ను ఎగవేతగా పరిగణిస్తారు. అసలు పన్ను, వడ్డీతో పాటు గరిష్ఠంగా 200 శాతం వరకు పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. ఒక వేళ పొరపాటున ఇలాంటి తప్పుడు క్లెయిమ్‌లు చేస్తే నోటీసు రాకముందు సరిదిద్దుకోవడం బెటర్. నిజాయితీగా ఉన్నారని నిరూపించడానికి సహాయపడుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×