E-Paper
Advertisement

81% growth in Honda Sales: రికార్టుల మోత.. 48 లక్షల బైకులను సేల్స్ చేసిన హోండా..!

81% growth in Honda Sales: రికార్టుల మోత.. 48 లక్షల బైకులను సేల్స్ చేసిన హోండా..!
Advertisement
Two Wheeler Sales
Two Wheeler Sales

81% growth in Honda Sales: ప్రస్తుత కాలంలో బైకుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి చిన్న అవసరాలకు కూడా బైకులను ఉపయోగిస్తున్నారు. టూ వీలర్ మార్కెట్‌లో ఈవీలు ఎంట్రీ ఇవ్వడంతో వీటిపై క్రేజ్ మరింతగా పెరిగింది. భారత్ టూ వీలర్ మార్కెట్‌లో అనేక పాపులర్ కంపెనీలు ఉన్నాయి. అందులో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హెండా కూడా ఒకటి. హోండా స్పోర్ట్స్ బైకుల నుంచి మిడ్ రేంజ్ బైకులను కూడా తయారు చేస్తోంది. హోండా ముఖ్యంగా అధిక మైలేజ్ బైకులను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటుంది. దేశీయ మార్కెట్‌లో ఈ బైకులను భారీ డిమాండ్ ఉంది.  హోండా టాప్ సేలింగ్ బైక్‌లలో యాక్టివా, షైన్‌లు ఉన్నాయి. అయితే కంపెనీ గతేడాది అమ్మకాలను భారీగా జరిపింది. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేయండి.

గత ఆర్థిక సంవత్సరంలో హోండా ద్విచ్రవాహనాల కంపెనీ 48 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. కంపెనీ లెక్కల ప్రకారం.. మొత్తం 48,93,522 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లో కంపెనీ ఏడాది ప్రాతిపదికన 81 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం పెరుగుదల 12 శాతం. మార్చి నెలలో కంపెనీ మొత్తం 3,86,455 యూనిట్లను సేల్స్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ సంఖ్య 358151 యూనిట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దేశీయంగా ఆరు కోట్ల విక్రయాలను కూడా అధిగమించింది. వీటిలో యాక్టివా, షైన్ వంటి బైక్‌లకు మార్కెట్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Also Read: ఏంటి భయ్యా ఈ క్రేజ్.. భారీగా పెరిగిన ఆడి అమ్మకాలు

హోండా ఇచ్చిన సమాచారం ప్రకారం.. మార్చి 2024లో 28,304 యూనిట్లను ఇతర దేశాలకు దిగుమతి చేసింది. అయితే ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఎగుమతుల్లో 95 శాతం వృద్ధిని సాధించింది.

Advertisement

గత ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్‌లో హోండా అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో SP160, SP125 స్పోర్ట్స్ ఎడిషన్, హార్నెట్ 2.0 యొక్క రెప్సోల్ ఎడిషన్, CB350, XL750 Transalp, NX500, గోల్డ్ వింగ్ టూర్ వంటి బైక్‌లు ఉన్నాయి. అదే సమయంలో, Dio125, Activa  లిమిటెడ్ ఎడిషన్ కూడా భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది.

Also Read: మార్కెట్లోకి రానున్న న్యూ స్పోర్ట్స్ బైక్స్.. ఫీచర్స్ చూస్తే ఉంటది నా సామి రంగ..!

CB200X, Hornet Repsol, Horent 2.0, SP160, Unicorn, SP125, SP125Sports, Shine125, Livo, CD110 Dlx, Shine100 వంటి బైక్‌లను హోండా ఆఫర్ చేస్తోంది. ఇవి కాకుండా.. కంపెనీ CB350, CB300R, CB300F, NX500, XL750 Transalp, గోల్డ్ వింగ్ టూర్‌లను ప్రీమియం బైక్‌లుగా అందిస్తోంది. Dio125, Dio 125 Repsol Edition, Activa Spl Edition, Activa 125, Activa, Dio వంటి స్కూటర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×