E-Paper
Advertisement

Bank Kyc Update: బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్.. ఆన్ లైన్ ప్రాసెస్ ఇదే

Bank Kyc Update: బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్.. ఆన్ లైన్ ప్రాసెస్ ఇదే
Advertisement

Bank Kyc Update: మీ బ్యాంక్ అకౌంట్ లో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లేదా వ్యక్తిగత వివరాలు మార్చుకోవడానికి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్‌లు, డీమ్యాట్ అకౌంట్, ఇన్సూరెన్స్ కు కేవైసీ అప్డేట్ తప్పనిసరి. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే వెళ్లనక్కర్లేదు. ఆన్ లైన్ కూడా చేసుకోవచ్చు.

కేవైసీ అప్డేట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

మీ అడ్రస్, పేరు, కాంటాక్ట్ నెంబర్ లేదా ఏదైనా వ్యక్తిగత వివరాలలో మార్పు ఉంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్‌లో పేరును మార్చుకుంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. బ్యాంక్ లేదా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి Re-KYC నోటీసు వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవాలి.

కేవైసీ అప్డేట్ ఆన్ లైన్ లో ఇలా?

  • నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ సిబ్బందితో నేరుగా లైవ్ కాల్ మాట్లాడి మీ డాక్యుమెంట్స్ చూపించవచ్చు. బ్యాంక్ సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఈ-మెయిల్ ఆధారిత KYC- మీ పేరు, కస్టమర్ ఐడీ/ఖాతా నంబర్‌, KYC డాక్యుమెంట్స్, బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ అధికారిక ఈ-మెయిల్ ఐడీకి మెయిల్ పంపండి. మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీస్ పెట్టుబడిదారులు CAMS, NSDL వంటి కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ పోర్టల్‌ ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
  • కస్టమర్ సర్వీస్ చాట్‌బాట్- కొన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లోని చాట్‌బాట్ ల ద్వారా కేవైసీ అప్‌డేషన్ సేవలను అందిస్తున్నాయి.
  • కస్టమర్ కేర్ నంబర్ – కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్ కేర్ నంబర్‌ సర్వీస్ ద్వారా కేవైసీ అప్డేట్ సేవలను అందిస్తున్నాయి.

నెట్‌బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కేవైసీ అప్డేట్ విధానం

Advertisement

1. నెట్‌బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
2. ప్రొఫైల్ సెట్టింగ్స్ లో “Update KYC” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్ వివరాలను ఎంటర్ చేయండి.
4. ఐడెంటిటీ, అడ్రస్ ఫ్రూఫ్ వంటి కేవైసీ డాక్యుమెంట్ స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయండి.
5. ఓటీపీ ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

Also Read:  జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

కేవైసీపీ అప్డేట్ పత్రాలు

  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • 2-3 నెలల కంటే పాతవి కాని యుటిలిటీ బిల్లులు
  • బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×