E-Paper
Advertisement

అప్పుల ఊబి నుంచి బయటపడే సింపుల్ చిట్కాలు

అప్పుల ఊబి నుంచి బయటపడే సింపుల్ చిట్కాలు
Advertisement

Get Out Debt Trap Tips: ఈ రోజుల్లో అప్పు లేని వ్యక్తులు అరుదు. అప్పు తీసుకోవడం సులభమే కానీ తిరిగి చెల్లించడమే కష్టం. సక్రమంగా అప్పు కట్టాలంటే.. అందుకు తగిన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే కొన్ని తెలివైన చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

ఒకే అప్పు

రుణాల నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి.. ఒక్కటే అప్పు. అంటే.. తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ తీసుకుని, ఇతర అప్పులను తీర్చేయాలి. ఎక్కువ అప్పులను సింగిల్ అప్పుగా మార్చుకోవాలి. దీంతో వడ్డీ భారం తగ్గడంతో పాటు ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.

కొత్త అప్పులు వద్దు

Advertisement

ఉన్న అప్పులు తీర్చే వరకూ కొత్త అప్పులు జోలికెళ్లొద్దు. ఇప్పటికే ఉన్న అప్పులను తొందరగా తీర్చడంపై దృష్టి పెట్టాలి. అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఏ రుణాలపై వడ్డీ వేగంగా పెరుగుతుందో గమనించి, వాటిని ముందుగా చెల్లిస్తే.. మిగిలిన మొత్తంపై వడ్డీ భారం తగ్గుతుంది. మీరు తప్పనిసరిగా ఒక బడ్జెట్‌ను ఫిక్స్ చేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. మీ బడ్జెట్ కు లోబడే ఖర్చు చేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్ వాడకాన్ని కూడా తగ్గించుకోవాలి.

ఆదాయాన్ని పెంచుకోండి

అప్పులు చెల్లించడానికి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలకు అనుగుణంగా.. పార్ట్‌టైమ్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ చేయండి. రైడ్ షేరింగ్, డ్రైవింగ్ లేదా ట్యూటరింగ్ చేయవచ్చు. మీ అభిరుచికి తగిన పనులు చేస్తూ డబ్బు సంపాదించండి. అదనపు ఆదాయంతో అప్పులను త్వరగా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డుపై అప్పు తీసుకుంటే.. దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఎందుకంటే, దానిని సకాలంలో తిరిగి చెల్లించకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు అప్పును సకాలంలో తిరిగి చెల్లించకపోతే, ప్రతి వాయిదాకు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

అప్పుల ఊబి నుంచి బయటపడటానికి నిపుణుల సహాయం తీసుకోండి. ప్రొఫెషనల్ డెట్ కౌన్సెలింగ్ ఏజెన్సీలు అప్పులు త్వరగా చెల్లించడంపై సలహాలు, సూచనలు ఇస్తుంటాయి. కౌన్సెలింగ్ ఏజెన్సీలు మీ బడ్జెట్‌ను రూపొందించడం, ఖర్చు పరిమితులను నిర్ణయించడంలో సహాయపడతాయి.

Also Read: పదేళ్ల పిల్లాడికి ప్యాకెట్ మనీ ఇవ్వచ్చా? వాటి వల్ల లాభనష్టాలేంటి?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×