E-Paper
Advertisement

Rs 10 Crore Goal: 15 ఏళ్లలో రూ.10 కోట్ల టార్గెట్.. ఎస్ఐపీ, ఈపీఎఫ్ లతో సాధ్యమేనా?

Rs 10 Crore Goal: 15 ఏళ్లలో రూ.10 కోట్ల టార్గెట్.. ఎస్ఐపీ, ఈపీఎఫ్ లతో  సాధ్యమేనా?
Advertisement

Rs 10 Crore Goal: సరైన పెట్టుబడి ప్రణాళిక ఉంటే తక్కువ పొదుపుతో పెద్ద మొత్తం అసాధ్యమేం కాదు. చాలా మంది పెట్టుబడిదారులకు రూ. 10 కోట్ల సంపాదన ఒక కల. అంత భారీ లక్ష్యా్న్ని చేరుకోవాలంటే.. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ, ఈపీఎఫ్ లో పెట్టుబడులు సహాయపడతాయి. మీరు 15 సంవత్సరాలలో రూ. 10 కోట్ల కార్పస్‌ను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

పెట్టుబడి ఎలా?

మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో రెగ్యులర్ పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడిపై కాంపౌండింగ్ వడ్డీతో భారీగా కార్పస్ పెరుగుతుంది. మరోవైపు, ఈపీఎఫ్ లో పెట్టుబడికి మంచి రాబడి ఉంటుంది. దీనిపై ట్యాక్స్ కూడా ఉండదు. ప్రస్తుతం ఈపీఎఫ్ పై ఏడాదికి 8.25% వడ్డీ వస్తుంది. ఇది తక్కువ రిస్క్ ఇన్వెస్ట్మెంట్. 15 సంవత్సరాలలో రూ. 10 కోట్ల సంపాదనకు.. ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలో నెలకు రూ.1,20,000 చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. మొత్తం పెట్టుబడి రూ.2.16 కోట్లు అవుతుంది. ఏడాదికి 12% రాబడి అంచనా వేస్తే.. మొత్తం రాబడి రూ.3.55 కోట్లు అవుతుంది. ఫైనల్ గా మెచ్యూరిటీ కార్పస్ రూ.5.71 కోట్లు వస్తుంది.

Advertisement

ఎస్ఐపీలో పెట్టుబడి

  • నెలకు పెట్టుబడి: రూ. 1,20,000
  • కాల పరిమితి: 15 సంవత్సరాలు
  • రాబడి: సంవత్సరానికి 12% (అంచనా)
  • మొత్తం పెట్టుబడి: రూ. 2.16 కోట్లు
  • రాబడి అంచనా: రూ. 3.55 కోట్లు
  • మెచ్యూరిటీ కార్పస్: రూ. 5.71 కోట్లు

మీకు నెలకు రూ.5 లక్షలు జీతం వస్తే.. 15 ఏళ్లకు ఈపీఎఫ్ లో మీ పెట్టుబడి రూ.2.14 కోట్లు అవుతుంది. ఏడాదికి 8.25 శాతం వడ్డీ చొప్పున రాబడి రూ. 2.06 కోట్లు అవుతుంది. దీంతో మెచ్యూరిటీ కార్పస్ రూ. 4.2 కోట్లకు చేరుతుంది. ఎల్ఐపీ, ఈపీఎఫ్ పెట్టుబడులతో 15 ఏళ్లలో రూ.10 కోట్లను సంపాదించవచ్చు. అయితే ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడులపై రాబడి 12-15 శాతం ఉంటే మీరనుకున్న లక్ష్యం సాధ్యమే. అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతాయి. దీర్ఘకాలం పెట్టుబడులపై ఈ ప్రభావం ఉండదు.

Advertisement

ఈపీఎఫ్ పెట్టుబడి

  • నెల జీతం : రూ. 5,00,000
  • పదవీకాలం: 15 సంవత్సరాలు
  • రాబడి: సంవత్సరానికి 8.25%
  • మొత్తం పెట్టుబడి: రూ. 2.14 కోట్లు
  • రాబడి అంచనా : రూ. 2.06 కోట్లు
  • మెచ్యూరిటీ కార్పస్: రూ. 4.2 కోట్లు

Also Read: నెలకు రూ.5,000 SIP vs రూ.60,000 ఒకేసారి పెట్టుబడి.. 10 ఏళ్లలో ఎక్కువ రాబడి ఎవరికంటే?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×