E-Paper
Advertisement

పెట్రో బాంబు పేలింది.. కిరాణా కొట్టు నుంచి క్యాబ్ ప్రయాణం వరకు.. ధరలు పెరగనున్న లిస్ట్ ఇదే!

పెట్రో బాంబు పేలింది.. కిరాణా కొట్టు నుంచి క్యాబ్ ప్రయాణం వరకు.. ధరలు పెరగనున్న లిస్ట్ ఇదే!
Advertisement

Fuel Inflation: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే చమురు ధరల పెంపు అనేది.. వాహనదారులనే కాకుండా సమాజంలోని ప్రతీ వర్గాన్ని ప్రభావితం చేస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరల నుంచి క్యాబ్ చార్జీల వరకు అన్నీ భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంధన ధరల పెంపు నేపథ్యంలో దేశంలో ఏయే రంగాలు ప్రభావితం కానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిత్యావసరాల ధరలు

దేశంలో ఎప్పుడు ఇంధన ధరల పెరిగినా.. అది పరోక్షంగా సామాన్యుల వంటగదిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మనకు నిత్యం అవసరమైన కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర కిరాణా సామాగ్రిని మార్కెట్లకు తరలించడానికి ట్రక్కులు, వ్యాన్లు తప్పనిసరి. డీజిల్ ధరలు పెరగడంతో సరుకు రవాణా చార్జీలు (Freight charges) భారమై వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపైనే నెట్టే అవకాశముంది. దీనివల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ మరింత పెరిగిపోవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్యాబ్, ఆటో ప్రయాణాలు భారం

Advertisement

ప్రస్తుత రోజుల్లో నగరాల్లో నివసించే వారికి క్యాబ్, ఆటో సేవలు నిత్యావసరంగా మారిపోయాయి. అయితే ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు తమ చార్జీలను పెంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రైవర్లు కూడా తమ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల ‘సర్జ్ ప్రైసింగ్’ పేరిట అదనపు వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా చేస్తున్నారు.

ఈ-కామర్స్, డెలివరీ ఛార్జీలు

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలసిందే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు వస్తువులను డెలివరీ చేయడానికి పెద్ద ఎత్తున వాహనాలను వినియోగిస్తున్నాయి. అయితే ఇంధన ధరల సెగ వీటికి కూడా తగిలే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు నేరుగా వస్తువుల ధరలు పెంచకపోయినా.. ‘డెలివరీ ఫీజు’ లేదా ‘హ్యాండ్లింగ్ చార్జీలు’ పేరిట ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేసే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు

తయారీ రంగంపై ప్రభావం

Advertisement

రవాణా రంగానికి మాత్రమే కాకుండా పరిశ్రమలలో యంత్రాలను నడపడానికి కూడా డీజిల్ చాలా అవసరం. విద్యుత్ కోతలు ఉన్న సమయంలో జనరేటర్ల వినియోగానికి డీజిల్ నే వినియోగిస్తుంటారు.ఈ నేపథ్యంలో ఇంధన ఖర్చులు పెరిగినప్పుడు వస్తువుల తయారీ వ్యయం కూడా ఆటోమేటిగ్గా పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ రంగ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కొత్తగా ఇల్లు కట్టేవారిపై ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచొచ్చని పేర్కొంటున్నారు.

Also Read: కారు పార్కింగ్‌లో ఈ ‘రివర్స్’ లాజిక్ గురించి తెలుసా? అస్సలు మిస్ అవ్వకండి!

పర్యాటక రంగంపై ప్రభావం

ప్రస్తుత వేసవి సెలవుల నేపథ్యంలో చాలా మంది ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే అక్కడి లోకల్ క్యాబ్స్, ట్రావెల్ వాహనాలు.. ఇంధన ధరల పెంపు దృష్యా తమ ఛార్జీలను పెంచే అవకాశముంది. దీనివల్ల విహారయాత్రకు వెళ్లాలని భావించేవారు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తంగా చూస్తే దేశంలోని ప్రతీ ఒక్క రంగాన్ని.. చమురు పెంపు నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Also Read: కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×