E-Paper
Advertisement

Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..

Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..
Advertisement

Gold Duty Free: ప్రముఖ సినీ నటి రన్యా రావును ఇటీవల బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆమె నుంచి ఏకంగా 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ మార్కెట్లో రూ. 12.56 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఘటన తర్వాత అసలు దుబాయ్ నుంచి భారతదేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత పరిమాణం వరకు అనుమతి ఉంది. రూల్స్ ఏం చెబుతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నో ట్యాక్స్

భారతదేశంలో బంగారం అసలు విలువతో పాటు, దానిపై పన్ను కూడా విధించబడుతుంది. ఈ కారణంగా బంగారం ధర మరింత పెరుగుతుంది. కానీ దుబాయ్‌లో బంగారంపై ఎలాంటి పన్ను లేదు. అందుకే అనేక మంది దుబాయ్ నుంచి అక్రమ మార్గంలో ఇండియాకు గోల్డ్ తీసుకొచ్చి దొరికిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ దీనిపై పరిమితి ఉంది.

ఎంత సేవ్ చేసుకోవచ్చు

Advertisement

మార్చి 7న దుబాయ్‌లో బంగారం ధర 10 గ్రాములకు 3,260 AED (UAE దిర్హామ్). ఇండియా రూపాయల్లో చెప్పాలంటే ఇది రూ.77,281.46. ఇదే సమయంలో ముంబైలో 10 గ్రాములకు గోల్డ్ రూ. 87,480గా ఉంది. అంటే దుబాయ్ బంగారం ధర కంటే ఇండియాలో దాదాపు 11.58 శాతం ఎక్కువ.

Read Also: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ మళ్లీ ప్రారంభం.. వీటిపై బంపర్ ఆఫర్స్..

రూల్స్ తప్పనిసరి

Advertisement

విదేశాల నుంచి భారతదేశానికి బంగారాన్ని తీసుకురావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులు, కస్టమ్ సుంకం నియమాలు తప్పక పాటించాలి. ఈ క్రమంలోనే భారతదేశంలోకి విదేశాల నుంచి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.

మీరు ఎంత బంగారం తీసుకురావచ్చు? ( పన్ను లేకుండా)

  • పురుష ప్రయాణీకుడు: 20 గ్రాముల వరకు బంగారం (గరిష్ట విలువ రూ. 50,000)
  • మహిళా ప్రయాణీకులు: 40 గ్రాముల వరకు బంగారం (గరిష్ట విలువ రూ. 1,00,000)
  • 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు: 40 గ్రాముల పరిమితి
  • ఈ పరిమితిలోపు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చేందుకు ఎలాంటి కస్టమ్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణీకులు ఈ మొత్తంకంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే మాత్రం కస్టమ్స్ సుంకం చెల్లించాలి.

పురుష ప్రయాణీకులకు కస్టమ్ సుంకం రేట్లు

  • 20 గ్రాముల వరకు (రూ. 50,000 విలువ) ఎటువంటి ఛార్జీలు ఉండవు
  • 50 గ్రా 3%
  • 100 గ్రాములు 6%
  • 100 గ్రా కంటే ఎక్కువ 10%

మహిళా ప్రయాణీకులకు కస్టమ్ డ్యూటీ రేట్లు

  • 40 గ్రాముల వరకు (రూ. 1,00,000 విలువ) ఎటువంటి ఛార్జీలు లేవు
  • 100 గ్రా 3%
  • 200 గ్రాములు 6%
  • 200 గ్రాముల కంటే ఎక్కువ 10%

పిల్లలకు బంగారం తీసుకురావడానికి నియమాలు

15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా 40 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా తీసుకురావచ్చు. కానీ దీని కోసం వారు సంబంధిత రుజువు చూపించాల్సి ఉంటుంది.

బంగారు నాణేలకు వర్తించే నియమాలు

20 గ్రాముల వరకు బంగారు నాణేలపై కస్టమ్ సుంకం ఉండదు
20 నుంచి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలపై 10% కస్టమ్ డ్యూటీ వర్తిస్తుంది
100 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు నాణేలపై కూడా 10% కస్టమ్ డ్యూటీ చెల్లించాలి

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రత్యేక నియమాలు

ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉంటున్న భారత పౌరులు (PIOలు) రాయితీ కస్టమ్స్ సుంకంతో బంగారాన్ని తీసుకురావచ్చు. వీరికి వర్తించే నియమాలు క్రింది విధంగా ఉంటాయి.

  • ప్రాథమిక కస్టమ్ సుంకం 12.5%
  • సోషల్ వెల్ఫేర్ సెస్ (SWS) 1.25%
  • మొత్తంమీద భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ మినహాయింపు పరిధిలోకి వస్తే 13.75% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది

బంగారం తీసుకురావడానికి అవసరమైన పత్రాలు

  • బంగారం కొనుగోలు రసీదు
  • బంగారం స్వచ్ఛత, నాణ్యత ధృవీకరణ పత్రం
  • బంగారు కడ్డీపై గుర్తించబడిన బరువు, సీరియల్ నంబర్ సమాచారం
  • ప్రయాణీకులు తప్పుడు సమాచారం అందిస్తే లేదా నియమాలను పాటించకపోతే, వారి బంగారాన్ని జప్తు చేస్తారు.
Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×