E-Paper
Advertisement

Honda Freedom Fest: బంపర్ డిస్కౌంట్లు.. హోండా కార్లపై కొనసాగుతున్న ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.96 వేలు పొందొచ్చు..!

Honda Freedom Fest: బంపర్ డిస్కౌంట్లు.. హోండా కార్లపై కొనసాగుతున్న ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.96 వేలు పొందొచ్చు..!
Advertisement

Honda Freedom Fest: దేశంలో కారు కొనేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం వాహన దారులను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త కార్లను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. అయితే వాటి ధరలు అధికంగా ఉండటంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కారు కొనుక్కోవాలనుకునే కల కలగానే ఉండిపోతుంది. ధరలు ఎక్కువగా ఉండటంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడొక గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హూండా భారీ ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ‘హూండా ఫ్రీడమ్ ఆఫర్లు’ అందిస్తుంది.

కంపెనీ తన అమేజ్, ఎలివేట్, సిటీ, సిటీ ఈహెచ్ఈవీ కార్లపై ఊహించని డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌తో సామాన్యులు కూడా కొత్త కారు కొనుక్కునే వీలుంటుంది. ఈ ఫ్రీడమ్ ఆఫర్ల కింద భారీ డిస్కౌంట్లతో పాటు కారు కొనుగోలుపై దాదాపు 3 ఏళ్ల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా కంపెనీ అందించనుంది. ఈ ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కంపెనీ ఏ ఏ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించిందో అనే విషయానికొస్తే.. అమేజ్ మోడల్‌పై రూ.96,000, సిటీ ఈ-హెచ్‌ఈవీపై రూ.88,000, సిటీ మోడల్‌పై రూ.90,000, ఎలివేటర్ మోడల్‌పై రూ.65,000 సహా బెనిఫిట్స్‌ అందించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

హూండా అమేజ్ సెడాన్ దేశీయ మార్కెట్‌లో రూ.7.20 లక్షల నుంచి రూ.9.96 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య అందుబాటులో ఉంది. ఇంది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఈ, ఎస్ అండ్ విఎక్స్ వేరియంట్లు. ఈ మోడల్ 1.2 4సిలిండర్ ఎన్ఏ పెంట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్‌కు 18.3 నుంచి 18.6 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: వదలొద్దు బిగులు.. ఎస్‌యూవీపై రూ.83 వేల డిస్కౌంట్.. దేశంలో వేగంగా అమ్ముడైన కారు ఇదే..!

Advertisement

ఇదిలా ఉంటే మరో మోడల్ ఎలివేట్. ఈ ఎస్యూవీ దేశీయ మార్కెట్‌లో రూ.11.91 లక్షల నుంచి రూ.16.51 లక్షల ఎక్స్ షోరూమ్‌ ధరతో లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఎస్‌వి, వి, విఎక్స్, జెడ్ఎక్స్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1.5 లిటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. లీటర్‌కు 15.31 నుంచి 16.92 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చారు. ఎడీఏఎస్ సిస్టమ్‌ను అందించారు.

హోండా సిటీ సెడాన్ దేశీయ మార్కెట్‌లో రూ.12.08 లక్షల నుంచి రూ.16.35 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. లీటర్‌కు 18.4 కి.మీ మైలేజీ అందిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫ్రీడమ్ ఫెస్ట్‌లో భాగంగా 3 ఏళ్ల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీని కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×