E-Paper
Advertisement

HDFC Shares Crash: ఒక్క రాజీనామాతో రూ.1 లక్ష కోట్లు ఆవిరి.. HDFCలో ఏం జరుగుతోంది?

HDFC Shares Crash: ఒక్క రాజీనామాతో రూ.1 లక్ష కోట్లు ఆవిరి.. HDFCలో ఏం జరుగుతోంది?
Advertisement

HDFC Shares Crash: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులో ఒక్క రాజీనామా గంటల వ్యవధిలో పెట్టుబడిదారుల సంపదలో రూ. 1 లక్ష కోట్లకు ఆవిరైపోయింది. పైగా మార్కెట్ పతనానికి దారితీసింది. తన వ్యక్తిగత విలువలను విరుద్ధంగా పనిచేయలేనని హెచ్డీఎఫ్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి చక్రవర్తి బుధవారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో గురువారం హెచ్డీఎఫ్సీ షేర్ వ్యాల్యూ దాదాపు 9% పతనమైంది.

9 శాతం నష్టం

తాను బ్యాంకులో జరిగిన ఎలాంటి తప్పులనూ ఎత్తి చూపడం లేదని, నా సిద్ధాంతాలు ఆ సంస్థతో సరిపోలలేదని చక్రవర్తి మీడియాతో అన్నారు. బుధవారం రాత్రి హెచ్డీఎఫ్సీ బ్యాంకు చక్రవర్తి రాజీనామాను వెల్లడించింది. తన లేఖలో, గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేవని చక్రవర్తి రాశారు. తన రాజీనామాకు ఎలాంటి ముఖ్యమైన కారణాలను ఆయన చెప్పలేదు. ఛైర్మన్ రాజీనామాతో మార్కెట్లు వేగంగా రియాక్ట్ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ షేర్లు 8.66% తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ షేర్ రూ. 770 వద్ద ఉంది. యూఎస్ లిస్టెడ్ ఏడీఆర్‌లు రాత్రికి రాత్రే 7% పైగా పతనం అయ్యాయి. ఈ ఏడాది హెచ్డీఎఫ్సీ స్టాక్ 15% పతనాన్ని చూసింది.

తాత్కాలిక ఛైర్మన్ గా

Advertisement

HDFC మాజీ సీఈవో కేకీ మిస్త్రీ.. ఆర్బీఐ ఆమోదంతో 3 నెలల కాలానికి తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకులో అంతర్గత విభేదాలు లేవని ఆయన తెలిపారు. చక్రవర్తి, బోర్డుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మిస్త్రీ అన్నారు. ఆయన తన లేఖలో పేర్కొ్న్న నైతిక విలువల కారణాలపై డైరెక్టర్లకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని మిస్త్రీ తెలిపారు. డిప్యూటీ ఎండీ కైజాద్ భరూచాకు అదనపు బాధ్యతలు కేటాయించారు.

Also Read:  జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు.. ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు, అదెలా?

మదుపర్ల సెంటిమెంట్

Advertisement

చక్రవర్తి రాజీనామా వెనుక స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. మదుపర్లు వెనకడుగు వేశారు. హెచ్డీఎఫ్సీ రాబడి బలంగా ఉన్నప్పటికీ, ఈ విషయంపై బోర్డు స్పష్టత ఇచ్చే వరకు పెట్టుబడిదారులపై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. సీఈఓ శశిధర్ జగదీషన్ నియామకంపై కూడా అనిశ్చితి కొనసాగుతుండడంతో.. హెచ్డీఎఫ్సీ స్టాక్‌ ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×