// // tle - Harshita Arora Journey: 15 ఏళ్లకు చదువు డ్రాపౌట్.. చేతిలో రూ. 7600 కోట్ల కంపెనీ, ఎవరు హర్షిత అరోరా? Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Harshita Arora Journey: 15 ఏళ్లలో చదువు డ్రాపౌట్.. రూ. 7600 కోట్ల కంపెనీకి నిర్మాత, ఎవరు హర్షిత అరోరా?

Harshita Arora Journey: 15 ఏళ్లలో చదువు డ్రాపౌట్.. రూ. 7600 కోట్ల కంపెనీకి నిర్మాత, ఎవరు హర్షిత అరోరా?
Advertisement

Harshita Arora Journey: ట్రెండ్ మారింది.. పిల్లలు చదువుకునే రోజులు క్రమంగా పోతున్నాయి.. తమ ఆలోచనలతో కంపెనీలను నిర్మించే పనిలో పడ్డారు. అందుకు వాళ్లు చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా ఇంతా కాదు. హర్షిత అరోరా విషయంలో అదే జరిగింది?  సాధించాలనే పట్టుదల ఉంటే విజయం దక్కుతుందని నిరూపించింది.. సక్సెస్ అయ్యింది?

15 ఏళ్లకు పాఠశాల డ్రాపౌట్.. హర్షిత అరోరా? మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను ఐఐటీ, ఐఐఎం, నీట్ చదివించాలని కోరుకుంటారు. అందుకోసం వారి తల్లిదండ్రులు పడిన, పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. హర్షిత అరోరా కూడా అలాంటిదే. కాకపోతే తాను అనుకున్నది సాధించాలనే తపన చాలా ఎక్కువ. పైన కనిపిస్తున్న యువతి పేరు హర్షిత అరోరా.

Advertisement

వయస్సు కేవలం 24 ఏళ్లు. ఆమె సొంతూరు యూపీలోని సహారన్‌పూర్. ఒక్కమాటలో చెప్పాలంటే మధ్య తరగతి ఫ్యామిలీ. తండ్రి స్టాక్‌బ్రోకర్‌ కాగా, తల్లి గృహిణి. చిన్నప్పుడు టెక్నాలజీ వైపు హర్షిత కన్నుపడింది.  ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. హర్షిత అప్పటికే తన మనసు మార్చుకుంది.

చదవడం కాదు.. సలహాలు, నిర్మాణాలే ఆమె ఆలోచనలు- కేవలం  చదవడం కాదు.. టెక్నాలజీ ఆధారిత కంపెనీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 13వ ఏట మొదటి కోడ్ లైన్‌ను రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వయస్సులో కోడింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. కోడింగ్ నేర్చుకునేందుకు ఎనిమిదో తరగతి మానేసి ఇంటి దగ్గరే చదువుకోవాలని డిసైడ్ అయ్యింది. కానీ పెద్దలు అంగీకరించలేదు. కానీ తన ఆలోచనలపై వెనుకడుగు వేయలేదు.

Advertisement

15 ఏళ్ల వయస్సులో చదువుకు డ్రాపౌట్ అయ్యింది. చదువు వద్దనుకుని కోడింగ్-టెక్నాలజీ అంశాలపై ఫోకస్ చేసింది. 16 ఏళ్లకు బెంగళూరు సేల్స్‌ఫోర్స్ ఆఫీసులో ఇంటర్న్‌షిప్ సాధించింది. 16 ఏళ్లకు క్రిప్టో పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్ యాప్‌ను క్రియేట్ చేసింది. స్పష్టంగా ప్రజలకు సరిగ్గా అవసరమైన విధంగా రూపొందించింది.

ఆపిల్ సంస్థ దాన్ని గమనించి తమ యాప్‌లో చేర్చింది. ఆ యాప్ అమెరికా-కెనడా వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్‌గా మారిపోయింది. ఆ తర్వాత కొద్దికాలానికి ఓ కంపెనీ ఆ యాప్‌ని కొనుగోలు చేసింది. హర్షితకు  స్వాగతం పలికింది శాన్ ఫ్రాన్సిస్కో. 2019లో ఆమె..  విజ్ఞాన్-తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్‌ను ప్రారంభించింది.

 సహారన్‌పూర్‌ టు సిలికాన్ వ్యాలీ-అక్కడ ట్రక్‌ ఇండస్ట్రీ ఎదుర్కొన్న కష్టాలు గమనించింది. ఇంధన కార్డులు, ట్రక్‌ యజమానులకు తక్షణ చెల్లింపులు, ఆర్థిక సాయం ఇచ్చే పథకాలు తెచ్చారు. అమెరికాలో 30వేల ట్రక్‌లు దీని పరిధిలో పని చేస్తున్నాయంటే హర్షిత ఆలోచన ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్టప్‌ ద్వారా హర్షిత 2020లో వై కాంబినేటర్‌ ఇంక్యుబేషన్‌కు ఎంపికైంది. దీనికోసం శాన్‌ ఫ్రాన్సిస్కోలో ట్రైనింగ్ తీసుకుంది.

రెండేళ్ల కిందట ఎ టు బి నుంచి బయటకు వచ్చేసింది. 2022 నాటికి ఆ సంస్థ విలువ సుమారు రూ. 6,400 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.7600 కోట్లకు చేరింది. టెక్‌ రంగంలో ఆమె ప్రతిభకు 2020లో కేంద్ర ప్రభుత్వం బాల్‌ శక్తి పురస్కారం సొంతం చేసుకుంది. ఆ ఏడాది అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసింది. ఈ తరహా వీసా వివిధ రంగాల్లో అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఇస్తారు.

అందుకోసం ఆమెకు 10 మంది సీఈఓల సిఫార్సులు అవసరం కాగా వాటిని కూడా సాధించింది. అంతా బాగా జరుగుతున్న సమయంలో కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచంలో హర్షిత టీమ్ నెలల తరబడి శ్రమించింది. ఈ సమయంలో చాలా స్టార్టప్‌లు మూతపడ్డాయి. చాలా మంది వ్యవస్థాపకులు సాధారణ ఉద్యోగాలకు తిరిగి వెళ్ళిపోయారు.

ALSO READ: కలిసొచ్చిన ఆషాఢం.. బంగారం-వెండి ధరలు పతనం, ఈ రోజు మార్కెట్లో ధరలు  

హర్షిత, ఆమె టీమ్ బృందం అక్కడే ఉండి పోయిన దగ్గర వెతుక్కోవడం మొదలు పెట్టారు. 2021లో తొలిసారి వై కాంబినేటర్‌కు విజిటింగ్‌ పార్ట్‌నర్‌గా వెళ్లింది హర్షిత. అంకుర సంస్థల ఉత్పత్తుల నిర్మాణం, వ్యాపార విస్తరణలో మార్గనిర్దేశం చేసేవారు. ఆ సంస్థ ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలో సూచన చేసింది. మూడు బ్యాచ్‌లకు విజిటింగ్‌ పార్ట్‌నర్‌గా పని చేశారు. జనరల్‌ పార్ట్‌నర్‌గా అవకాశం కల్పించింది ఆ సంస్థ.

ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లో ఆమె కీలకపాత్ర పోషించింది.  ఆ కంపెనీకి తొలుత  విజిటింగ్ పార్టనర్‌గా ఉంటూ కంపెనీని నిర్మించడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సహాయపడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్‌గా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత తెలివైన, ఆశావాదులైన కొంతమందితో కలిసి పనిచేసే అవకాశం లభించింది.

ఏ స్టార్టప్‌లకు నిధులు ఇవ్వాలో, పెట్టుబడులు ఎక్కడ  పెట్టాలో డిసైడ్ చేస్తుంది హర్షిత. సహారన్‌పూర్‌కు చెందిన 15 ఏళ్ల యువతి ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నత స్థానంలో కూర్చుంది. చాలా మంది తమ కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టే వయసులో ఆమె వై కాంబినేటర్‌లో జనరల్ పార్టనర్ అయ్యింది. దటీజ్ హర్షిత అరోరా.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×