E-Paper
Advertisement

బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై.. ఎల్ఐసీలో మాత్రం!

బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై..  ఎల్ఐసీలో మాత్రం!
Advertisement

FDI In Insurance: ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ విషయాన్ని నోటిఫై చేసింది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 1938 నాటి బీమా చట్టం నిబంధనలకు అనుగుణంగా.. ఎఫ్‌డీఐని స్వీకరించే బీమా కంపెనీలు ఐఆర్డీఏఐ లైసెన్స్ లేదా అనుమతిని పొందాలనే షరతుకు లోబడి పనిచేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక చట్టం కింద కొనసాగుతున్నందున.. దీంట్లో ఆటోమేటిక్ రూట్ కింద విదేశీ పెట్టుబడులు 20%కి పరిమితం చేసింది. LICలో విదేశీ పెట్టుబడి అనేది జీవిత బీమా కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలు, జీవిత బీమా కార్పొరేషన్ చట్టం ఇతర నిబంధనలకు లోబడి పనిచేయాలి.

చట్ట సవరణలు

విదేశీ పెట్టుబడులున్న ఏ బీమా కంపెనీలోనైనా, బోర్డు ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లలో కనీసం ఒకరైనా భారతీయ పౌరుడై ఉండాలని కూడా ఈ నిబంధనలు తెలుపుతున్నాయి. గతంలో ఫిబ్రవరిలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నోటిఫై చేసింది. డిసెంబర్ 2025లో, పార్లమెంట్ ‘సబ్కా బీమా సబ్కీ రక్ష’ (బీమా చట్టాల సవరణ) బిల్లు 2025ను ఆమోదించింది. ఇది బీమా వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చింది.

సరిహద్దు దేశాలు 10 శాతం

Advertisement

మూడు ప్రధాన చట్టాలైన 1938 బీమా చట్టం, 1956 జీవిత బీమా కార్పొరేషన్ చట్టం, 1999 బీమా నియంత్రణ అభివృద్ధి అథారిటీ చట్టాన్ని కేంద్రం సవరించింది. ఈ ఏడాది మార్చిలో భారత్ తో సరిహద్దులను పంచుకునే అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ కొత్త మార్పుల తర్వాత, సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులలో 10% వరకు ఎలాంటి నియంత్రణ లేని పెట్టుబడుల వాటా పరిధిలోకి వస్తుంది. భారత్ సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించే ఫ్రేమ్‌వర్క్‌ కు కేబినెట్ సవరణలు చేసింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×