E-Paper
Advertisement

Gold rates increased: ఓడియమ్మ బంటి.. అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు ఇక చుక్కలే!

Gold rates increased: ఓడియమ్మ బంటి.. అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సామాన్యులకు ఇక చుక్కలే!
Advertisement

Gold rates increased: అమ్మో.. బంగారం ధరలు అత్యంత దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇకనుంచి సామాన్యులకే కాదు.. ప్రతిఒక్కరికి బంగారం కొనాలంటే చుక్కలే అంటున్న నిపుణులు.. నిన్న తగ్గినట్టే తగ్గి నేడు దానికి రెట్టింపు పెరిగింది. దీంతో తీవ్ర నిరాశ చెందుతున్న పసిడి ప్రియులు.. చాలా మంది ప్రజలు ఇవాళ పెరిగిన రేపు తగ్గుతాయి కదా అని ఆశపడ్డవారికి ఆశలు అడియాశలవుతున్నాయ్..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,310 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,710 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,450 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.5,400 పెరిగింది.

Advertisement

పట్టపగలే చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..
బంగారం ధరలు ట్రంప్ విధించిన సుంకాలు, అంతర్జాతీయంగా యుద్ధం ముంచుకు రావడం, డాలర్ తోటి సంబంధాలు, మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలై డిమాండ్ పెరగడం వల్లనే ఈ రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ధరలు ఇలాగే ఉంటే సామాన్యులకు బంగారం షాపుల మొహం చూడటం కూడా కష్టం అవుతుంది. అలాగే తులం కొనాలనుకున్నవారు అర్ధ తులంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,710 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,550 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఘోరం.. కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ద్యావుడా.. సిల్వర్ ధరలు బంగారం కన్నా ఒక రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. ఒక్కరోజులోనే అత్యంత భారీగా ధరలు పెరిగాయి. నిన్న గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,40,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,60,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.20,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,40,000 వద్ద పలుకుతోంది. నిన్నమొన్నటి వరకు సిల్వర్ ధరలు 3 లక్షలు దాటితేనే అమ్మో అనుకున్నవారు.. ఇప్పుడు 4 లక్షలు కూడా దాటే అవకాశం ఉంది. కావున.. సిల్వర్, బంగారం డబ్బులు ఉన్నప్పుడే కొనేసుకోండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×