E-Paper
Advertisement

బంగారం-వెండి కొనుగోళ్లకు సరైన సమయమా? మార్కెట్లో ధరల మాటేంటి, ఇంకా తగ్గవచ్చా?

బంగారం-వెండి కొనుగోళ్లకు సరైన సమయమా? మార్కెట్లో ధరల మాటేంటి, ఇంకా తగ్గవచ్చా?
Advertisement

Gold-Silver Prices: రానున్న రోజుల్లో బంగారం – వెండి పెరగనున్నాయా? పెళ్లిళ్లు, శుభకార్యాలకు కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా? పుత్తడి, వెండి ధరలు పెరగబోతున్నాయా? బులియన్ మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో లోహాల ధరలను ఒక్కసారి చూద్దాం.

బంగారం-వెండి కొనుగోళ్లకు సరైన సమయమా?

Advertisement

ఇరాన్‌పై అమెరికా యుద్ధం నేపథ్యంలో మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికితోడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఫలితంగా పసిడి, వెండి ధరలు ఊగిలాడుతున్నాయి. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్-MCXలో వెయ్యి రూపాయలు తగ్గి గోల్డ్ రూ. 1,58,588 వద్ద కొనసాగుతోంది. అటు సిల్వర్ ఫ్యూచర్స్‌లో రూ.3,400 తగ్గి కిలోకు రూ. 2,71,600 వద్ద ఉంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ డేటా ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ. 1,58,117కు చేరింది. సోమవారం మార్కెట్ ప్రారంభంలో ధర రూ. 1,57,821గా ఉంది. అయితే బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది కేంద్రం. దీంతో రెండేళ్ల కిందట చేసిన సుంకం తగ్గింపు పూర్తిగా రద్దయింది.

Advertisement

ఇకపై బంగారం-వెండి ధరల కదలిక అమెరికా-ఇరాన్ యుద్ధం పరిణామాలు, డాలర్ సూచీ, రూపాయిపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు దేశీయంగా బంగారం ఉత్పత్తి జరగబోతోందన్న వార్తలు మార్కెట్‌ను తాకింది. జూన్ లేదా జులైలో ఏపీలోని బంగారం ఉత్పత్తి మొదలుపెట్టేందుకు దక్కన్ గోల్డ్ మైన్స్ సిద్ధమైంది.

మార్కెట్లో ధరల మాటేంటి, ఇంకా తగ్గవచ్చా?

ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఒక్కసారి చూద్దాం. న్యూఢిల్లీలో బంగారం ధరలు 24న అంటే ఆదివారం 10 గ్రాములకు గాను 24 క్యారెట్ల బంగారం ధర రూ. 158,770 ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 145,539 ఉంది. ముంబైలో బంగారం ధరలు మే 24న ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 159,050 ఉండగా, అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 145,796 ఉంది.

టెక్ సిటీ బెంగళూరు విషయానికి వద్దాం. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 159,170 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 145,906 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 158,840 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 145,603.

ఇక హైదరాబాద్‌ మార్కెట్ విషయానికి వద్దాం ఆదివారం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 159,300 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 146,025 స్థిరంగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 159,510 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 146,218 వద్ద ఉంది.

ALSO READ: రూపాయి పతనం అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు.. స్వాప్ తో అడ్డుకట్ట

గతేడాది బంగారం ధరలు 75 శాతం పైగా పెరిగాయి. 1979 తర్వాత పసిడి అత్యంత బలమైన బుల్ రన్‌ను చవిచూసింది. దేశంలో పసుపు లోహం జనవరి ఆరంభంలో రూ. 135,257 నుండి మార్చి ఆరంభంలో రూ. 157,480 కి పెరిగింది. ఇది సుమారు 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మే నెలలో సుంకం పెంపు తర్వాత మళ్ళీ గణనీయంగా పెరిగింది.

ఇక వెండి విషయానికి వద్దాం. దేశంలో వెండి ధర గ్రాముకు రూ. 285 ఉంది. కిలో రూ. 2,85,000 నుంచి 2,95,000 మధ్య కదలాడుతోంది. బంగారం కంటే సిల్వర్ ధర తక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వెండిని సాధారణ ఎంపికగా చూస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం వెండికి డిమాండ్ ఉండడం అందుకు కారణం.  దీని ధర హెచ్చుతగ్గులలో కీలక పాత్ర పోషిస్తుంది. వెండి ధర ప్రపంచ మార్కెట్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్‌కతాలో వెండి కిలో ధర 2,85,000 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 2.95,000 వద్ద ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×