E-Paper
Advertisement

బంగారం-వెండి ధరలు మాటేంటి? సోమవారం పతనమా? పెరుగుతుందా?

బంగారం-వెండి ధరలు మాటేంటి? సోమవారం పతనమా? పెరుగుతుందా?
Advertisement

Gold-Silver Price: ఇరాన్ యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించింది. దీని ప్రభావం ఇంకా మార్కెట్లపై ఉంటుందా? అన్నట్లు బంగారం-సిల్వర్ ధరల మాటేంటి? మదుపరులు పెరగాలని కోరుకుంటున్నారా? సామాన్యులు ఇంకా తగ్గాలని చూస్తున్నారా? ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండనుంది. ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

బంగారం-వెండి ధరలు పడే అవకాశం?

Advertisement

అంతర్జాతీయంగా ఏదైనా అలజడి మొదలైతే పెట్టుబడుదారులు బంగారం-వెండి వైపు చూసేవారు. భారీగా అందులో పెట్టుబడులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఆ విధంగా లేదు. ఈ ఏడాది జనవరి మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఆశాకాన్ని తాకాయి. యుద్ధం నేపథ్యంలో డాలర్ బలం కావడంతో మదుపరులు లాభాలకు దిగారు. ఫలితంగా అమ్మకాలకు తెర లేపారు. మార్కెట్లో బంగారం-వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

ఇరాన్‌ని అష్ట దిగ్బంధం చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతమంతా 50 వేల మంది సైన్యాన్ని మోహరించింది. ఇరాన్ లొంగకుంటే దాని ఆర్థిక మూలాలపై దాడి చేయాలని అమెరికా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫైలు అధ్యక్షుడు ట్రంప్ టేబుల్‌పై ఉంది. అయితే ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన గడువుకు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది.

Advertisement

డాలర్ బలంగా ఉండడంతో  58 టన్నుల బంగారాన్ని అమ్మేసిన టర్కీ

మరోవైపు ఇరాన్ మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. అంతేకాదు ఇజ్రాయెల్‌పై హౌతీలు డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేశాయి. ఒక్కసారిగా గల్ఫ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. హౌతీలను కంట్రోల్ చేయకుంటే ఎర్ర సముద్రం ద్వారా నౌకా రవాణాకు ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ నిపుణులు బలంగా చెబుతున్నారు.

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం మార్కెట్లో బంగారం-వెండి ధరలు పతనం అయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం అర్థరాత్రి బంగారం ధరలు 0.50 శాతం పైగానే పతనం అయ్యాయి. మార్చి నెలలో పరిశీలిస్తే 15 శాతం బంగారం ధరలు పడిపోయాయి.

ALSO READ: ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు? లిమిట్ దాటితే పడే శిక్షలు ఏంటి?

ఇక సిల్వర్ విషయానికి వద్దాం. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ట్రేడింగ్‌లో ఈ లోహం ధరలు ఒక శాతం పైగా పతనమైంది.  మార్చి నెలలో 30 శాతం వరకు ధరలు పడిపోయాయి. గడిచిన 40 ఏళ్లలో ఈ స్థాయిలో వీటి ధరలు పడిపోవడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్చి 30న సోమవారం కూడా ధరల్లో అప్ అండ్ డౌన్స్ నెలకొనడం ఖాయమని అంటున్నారు.

అన్నట్లు అంతర్జాతీయ నివేదిక ప్రకారం.. టర్కీ సెంట్రల్ బ్యాంక్ రెండువారాల్లో 58 టన్నుల బంగారాన్ని అమ్మేసింది. దీని ద్వారా సుమారు ₹67,000 కోట్లు సంపాదించింది. ఈ ఏడాది ఆరంభం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం విక్రయం ఇదేనని అంటున్నారు. టర్కీ సెంట్రల్ బ్యాంక్-బ్లూమ్‌బెర్గ్-రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గడిచిన పదేళ్లలో టర్కీ ప్రపంచంలో భారీగా బంగారం కొనుగోలు దేశాల్లో ఒకటి.

గతేడాది అక్టోబర్ వరకు అంటే దాదాపు 23 నెలల పాటు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చింది టర్కీ. యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత మార్కెట్‌లో గందరగోళం మొదలైంది. డాలర్ డిమాండ్ పెరగడంతో టర్కీ కరెన్సీ వాల్యూ పడిపోయింది. బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టిందని చెబుతున్నాయి. దీని ప్రభావం సోమవారం మార్కెట్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×