E-Paper
Advertisement

Gold Silver Rates: రికార్డుల వేటలో పసిడి, వెండి.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో ముచ్చెమటలు పట్టిస్తున్న ధరలు

Gold Silver Rates: రికార్డుల వేటలో పసిడి, వెండి.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు.. పెళ్లిళ్ల సీజన్‌లో ముచ్చెమటలు పట్టిస్తున్న ధరలు
Advertisement

Gold Silver Rates: అబ్బా.. పసిడి ధరలు చూస్తుంటే గుండె గుభేల్ అంటున్నది. ఈ మధ్యన బంగారం రేట్లు రాకెట్ లెక్క ఆకాశానికి ఎగిసిపోతావున్నయ్. ఎన్నడు లేని విధంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు కూడా విలవిలలాడిపోతున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు పెళ్ళిల సీజన్ మొదలైతే చాలు.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలన్న తలిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్. ఈ అమెరికాలో ట్రంప్ తెచ్చిన టారిఫ్ గొడవలు, గ్రీన్ లాండ్ పంచాయితీలు, ఆ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోవడంతో అందరూ పోయి బంగారమే కొంటాండ్రు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు అదుపులేకుండా పోతున్నయ్.

బంగారం ధరలు ఇలాగే ఉంటే వచ్చే నెల ఆఖరి వరకు తులం బంగారం రెండు లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలు జనం మాత్రం ఆశగా షాపులోకి పోయి రేటు ఇంత ఎందుకు పెరిగింది? అని అడుగుతుంటే, ఆ నగల షాప్ వాళ్లు.. మా చేతుల్లో ఏముంది.. అంతా పైనుంచే వస్తోంది అని చెవుల పువ్వులు పెడుతుండ్రు. బంగారం కొనడం అంటే ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్ష తీరే అయిపోయింది. గీ రేట్లు ఇట్లనే ఉంటే సామాన్యుడు ఇంక బంగారం మొఖం చూడలేడేమో అన్నట్టు ఉంది పరిస్థితి.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు నేడు రికార్డు స్థాయిలో పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,080 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,78,850 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,150 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.11,770 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,78,850 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,950 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,79,000 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,64,100 వద్ద కొనసాగుతోంది.

Also Read: తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అమ్మబాబోయ్.. సిల్వర్ ధరలు పూట పూటకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 4,00,000 కాగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 4,25,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.25,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 4,10,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×