E-Paper
Advertisement

Gold rate today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఇవాల్టి రేటు వింటే మతులు పోవుడు గ్యారెంటీ

Gold rate today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. ఇవాల్టి రేటు వింటే మతులు పోవుడు గ్యారెంటీ
Advertisement

Gold rate today: ఏం చెప్పమంటవు భై.. బంగారం ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. నిన్న మొన్నటి వరకు ఒక తీరుగ ఉండె, కానీ ఇప్పుడు పైసలు ఉన్నోడు కూడా కొనాలంటే ఆలోచన చేసేటట్టు ఉన్నది పరిస్థితి. వారం తిరగక ముందే వేలల్లో పెరిగిపోయి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నది. నేటి బంగారం ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా కాదు అత్యంత భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,780 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,300 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.5,020 పెరిగింది.

Advertisement

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
అసలు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే.. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, గ్రీన్‌లాండ్‌ పంచాయితీ, వేరే దేశాలపై పన్నులు వేయడం వల్ల ప్రపంచ మార్కెట్ అంతా ఆగమాగం అయిపోయింది. దీనికి తోడు మన రూపాయి విలువ తగ్గడం, యుద్ధాల భయం వల్ల అందరూ బంగారం మీదనే పెట్టుబడి పెడుతున్నారు. ఇంకేముంది.. డిమాండ్ పెరిగి ధరలు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుంటే ఈ రేట్లు చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నరు

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 వద్ద పలుకుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,900 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,950 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్.. మరో ఆరుగురు నేతలకు నోటీసులు?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వద్దు రా బాబు.. బంగారం, సిల్వర్ ధరలు చూస్తుంటే భయమవుతుంది.. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఇప్పుడు బంగారం, సిల్వర్‌తో చాలా పనులు ఉంటాయి. కానీ ఆవి ఏమో ఆకాశాన్ని ఎక్కి కూర్చొన్నాయి. వాటిని ఎలా కొనాలని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,30,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,40,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.10,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 3,25,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×