E-Paper
Advertisement

Gold Rate Increased: వామ్మో.. పసిడి పరేషాన్! తులం బంగారం లక్షన్నర దాటింది.. సామాన్యుడు ఇంక కొన్నట్టేనా?

Gold Rate Increased: వామ్మో.. పసిడి పరేషాన్! తులం బంగారం లక్షన్నర దాటింది.. సామాన్యుడు ఇంక కొన్నట్టేనా?
Advertisement

Gold Rate Increased: అబ్బో.. ఈ బంగారం ధరలు చూస్తుంటే గుండె గుభేల్ మంటున్నది గదా! నిన్న మొన్నటి దాకా ఒక తీరుగ ఉన్న ధరలు, ఇయ్యాల ఒక్కసారిగా ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పెరిగిపోయినయ్. మధ్యతరగతి మనుషులు పిల్లల పెళ్లిళ్ల కోసం పైసలు వెనకేసి బంగారం కొందామంటే, ఈ రేట్లు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నయ్. ‘ఏంది సామీ ఈ గోస’ అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. శుక్ర‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 ఉండగా.. నేడు శ‌నివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 వద్ద ఉంది. అలాగే శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 కాగా.. నేడు శ‌నివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,970 పెరిగింది.

Advertisement

అసలు ఈ ధరలు ఎందుకు ఇట్లా ఉరుకుతున్నాయో తెలుసా?
దునియా మొత్తం మీద జరుగుతున్న యుద్ధాలు, గొడవలే దీనికి కారణమంట. అమెరికా గ్రీన్ లాండ్ లొల్లి, ఉక్రెయిన్-రష్యా పంచాయితీ వల్ల ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ అని చెప్పి బంగారం మీద పైసలు కుమ్మరిస్తున్నారు. దానికి తోడు మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ కూడా గట్టిగానే ఉంది. ఇప్పట్లో ఈ ధరలు తగ్గేటట్టు లేవని, ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పెద్ద మనుషులు చెబుతున్నారు. ఇప్పుడు బంగారం కొనడమంటే అగ్గిలో చేయి పెట్టినట్టే అని జనాలు భయపడుతున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,57,750 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద కొనసాగుతుంది.

Also Read: గోల్డ్ ఈటీఎఫ్‌లు వర్సెస్ ఫిజికల్ గోల్డ్.. పెట్టుబడులకు ఏది బెటర్?

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,900 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,750 వద్ద ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×