E-Paper
Advertisement

బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి

బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి
Advertisement

Gold-Silver Price Fall: అంతర్జాతీయ వ్యతిరేక పవనాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బంగారం, వెండి ధరలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ఫలితంగా పెట్టుబడుదారులు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. కనీసం బంగారం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పుత్తడి ధరలు పడే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పడిపోతున్న బంగారం-వెండి ధరలు

Advertisement

అంతర్జాగీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి తీవ్రమైంది. వరుసగా నాలుగో వారంలో పసిడి నష్టాలను మూట గట్టుకుంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ల వల్ల బంగారం ధర 4,000 అమెరికా డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. 2025 తర్వాత తొలిసారిగా ఆ స్థాయికి బంగారం ధర పడిపోయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,320 గా ఉంది. చెన్నైలో రూ. 1,43,340, ఢిల్లీలో ధర రూ. 1,41,470 గా కొనసాగుతోంది.

Advertisement

2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి.. ఇంకా పతనం తప్పదు?

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,29,540 గా ఉంది. కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో అదే ధర ఉంది. చెన్నైలో ధర రూ. 1,31,390గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 1,29,690గా ఉంది.ఇక వెండి ధరల విషయానికి వద్దాం. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైల్లో కిలో వెండి ధర రూ. 2,34,900 గా ఉంది. చెన్నైలో కిలో గ్రావెండి ధర రూ. 2,29,900 గా కొనసాగుతోంది.

స్పాట్ గోల్డ్‌ ధర 0.9 శాతం తగ్గి ఔన్స్‌కు 3,991.49 డాలర్లు చేరుకుంది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఓ శాతం క్షీణించింది. ఫలితంగా 4,007 డాలర్ల వద్దకు చేరింది. ఈ ఏడాది జనవరి 29న నమోదైన ఆల్‌టైమ్ హై 5,594 డాలర్లతో పోలిస్తే బంగారం ధర ఏకంగా 29 శాతం మేరా క్షీణించింది. ఈ వారంలో దాదాపు 4 శాతం తగ్గిపోయింది.

ALSO READ:  పొదుపు స్కీమ్ ఏది బెటర్.. నెలకు రూ. 13 వేల పైనే ఆదాయం

మరోవైపు వెండిది అదే పరిస్థితి. ప్రస్తుతం వెండి ధర 3.2 శాతం పతనమై ఔన్స్‌కు 56.01 డాలర్లకు చేరింది. కొన్నాళ్లుపాటు ఈ పతనం తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘ కాలం గరిష్టంగా ఉంచుతుందనే అంచనాలు మార్కెట్‌ను కాసింత కలవరపెడుతున్నాయి. మే నెలలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన దాని కంటే తక్కువగా అంటే 0.4 శాతం పెరిగింది.

ఐనప్పటికీ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. రాబోయే సెప్టెంబర్ నాటికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అమెరికా డాలర్ ఇండెక్స్.. 2025 మే తర్వాత బలమైన స్థాయికి చేరింది. డాలర్ బలపడితే ఇతర దేశాలకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతుంది. కొద్దిరోజుల వరకు బంగారం, వెండి ధరలు పతమయయే అవకాశముందని మార్కెట్ చెబుతున్నాయి.  5 లేదా 10 శాతం వరకు పతనం కావచ్చని అంచనాలు వేస్తున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×