E-Paper
Advertisement

Gold ETF Investment: గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే

Gold ETF Investment: గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
Advertisement

Gold ETF Investment:ఈ ఏడాదిలో బంగారం ధరలు 60% వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో పెట్టుబడిదారులను బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు, ముఖ్యంగా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ‘ డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ ఉత్పత్తుల’లో పెట్టుబడులపై సెబీ హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెబీ-రిజిస్టర్డ్ మధ్యవర్తుల అందించే గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తు్న్నారు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్లలో ఆర్థిక సాధనాలు, పెట్టుబడిదారులు వీటితో గోల్డ్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫండ్ హౌస్‌లు రూ.1.02 లక్షల కోట్ల మొత్తంతో 22 క్యారెట్ల బంగారు ఈటీఎఫ్ లను అందిస్తున్నాయి. ఈటీఎఫ్ లు అక్టోబర్‌లో రూ.7,743 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా మూడో నెలలో కూడా బంగారు ఈటీఎఫ్ లలోకి పెట్టుబడులు కొనసాగాయి. గోల్డ్ ఏయూఎమ్ వ్యాల్యూ రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. బంగారంపై పెట్టుబడులకు మరో అవకాశం ‘సావరిన్ గోల్డ్ బాండ్లు’ (SGBలు). వీటిని ప్రభుత్వం నిలిపివేసే అవకాశం ఉంది.

పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన విషయాలు

Advertisement

1. బంగారం ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఇవి బంగారం ధరల తరహాలోనే పెరుగుతాయి.

2. స్టాక్ మార్కెట్లో వీటిని కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.

Advertisement

3. ఈటీఎఫ్ విక్రయాలు, మూలధన లాభం ఇండెక్సేషన్ లేకుండా 12.5% ​​వరకు పన్ను విధించే అవకాశం ఉంది.

4. ఫిజికల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం కంటే ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ఎటువంటి నిల్వ ఖర్చు లేదా భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Also Read: Postal Savings Schemes: ఈ పోస్టాఫీస్ పథకాలతో అధిక రాబడి.. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ

Disclaimer: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందుగా సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుడిని సంప్రదించండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×