E-Paper
Advertisement

వామ్మో.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!

వామ్మో.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!
Advertisement

Gold Silver Rates: అయ్యయ్యో.. నిన్నమొన్నటి వరకు వరుసగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు, నేడు ఒక్కసారిగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, రూపాయి విలువలో హెచ్చుతగ్గుల కారణంగా దేశీయంగా పసిడి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు ‘ఇంకా తగ్గుతుందేమో.. అప్పుడు కొందాం’ అని వేచి చూసిన సామాన్యులకు ఈ హఠాత్ పరిణామం కోలుకోలేని షాక్ ఇచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ధరలు ఈ స్థాయిలో పెరిగిపోవడంతో, మార్కెట్‌కు వెళ్లిన కొనుగోలుదారులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. అయితే నేటి ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,780 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,770 పెరిగింది.

Advertisement

పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్యుడిపై మోయలేని భారం..
ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎంతో కాలంగా ప్లాన్ చేసుకుంటున్న పెళ్లిళ్ల బడ్జెట్‌లు ఈ ఆకస్మిక పెరుగుదల వల్ల పూర్తిగా తారుమారవుతున్నాయి. ఒకపక్క ఆడపిల్లల పెళ్లిళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు బంగారం కొనలేక ఆందోళన చెందుతుంటే, మరోపక్క నగల దుకాణాలు సైతం కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల అంచనాలు సామాన్య ప్రజల గుండెల్లో మరింత రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,650 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
వామ్మో.. నిన్నమొన్నటి వరకు నిశ్చలంగా ఉన్న సిల్వర్ ధరలు.. నేడు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. బుధవారం కేజీ సిల్వర్ రూ. 2,45,000 కాగా.. నేడు కేజీ సిల్వర్ ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ వెండిపై రూ. 5,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,45,000 వద్ద పలుకుతోంది.

Also Read: బీహార్‌లో పట్టపగలే ఘోరం.. గన్ పాయింట్‌లో బ్యాంక్ CSP దోపిడీ.. షట్టర్ వేసి మరీ!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×