E-Paper
Advertisement

Gold – Silver Price Jump: పుత్తడి ప్రియులకు ఝలక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold – Silver Price Jump: పుత్తడి ప్రియులకు ఝలక్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Advertisement

Gold – Silver Price Jump: అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్ పై పడింది. ఫలితంగా బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు మూడు వారాల తర్వాత బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరిగాయి. బంగారం 2 శాతం, వెండి ఏకంగా 6 శాతం ఎగబాకింది. ప్రస్తుతం ఆయా ధరల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

అంతర్జాతీయ పరిణామాలు.. పుత్తడి ప్రియులకు ఝలక్

Advertisement

సోమవారం ఉదయం పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా-ఇరాన్ యుద్ధ మేఘాలు, ట్రంప్ టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు హెచ్చరికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించాయి. ఫలితంగా భారతీయ కమోడిటీ మార్కెట్‌-MCX తీవ్ర ప్రభావం చూపింది.

మార్కెట్ ప్రారంభమైన గంటల వ్యవధిలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. బంగారం ధరలు రెండు శాతం పెరిగి మూడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. కొద్దిరోజులుగా భారీగా పతనమైన వెండి ధర ప్రారంభంలో దాదాపు 5 నుంచి 6 శాతం వరకు పెరిగింది.

Advertisement

మూడువారాల గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు

సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే భారీ లాభాలతో మొదలైంది. బంగారం ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.4 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 1,60,600 లకు చేరింది. అటు వెండి కూడా అదే జోరు కొనసాగింది. ఫ్యూచర్స్ ధర ఊహించని విధంగా 6 శాతం వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ. 2,68,120 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ 0.45 శాతం తగ్గి 97.36కు పడిపోయింది. డాలర్ విలువ తగ్గడంతో ఇతర కరెన్సీలున్న దేశాలకు బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా బంగారం, సిల్వర్ ధరలు మూడువారాల గరిష్టానికి చేరుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా తగ్గించిన వేళ డాలర్ విలువ పడిపోవడం మొదలైంది.

ALSO READ: బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్.. ఆన్ లైన్ ప్రాసెస్ ఇదే

మార్కెట్లో బంగారం ఔన్సుకు 1.2 శాతం పెరిగి 5,163.60కి చేరింది. బంగారం ధర పెరుగుదలపై సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ పైవిషయాలను తెలిపారు. సుదీర్ఘ సెలవుల తర్వాత చైనా మార్కెట్లు తెరవడంతో ఈ వారం వెండి,ఇతర లోహాల ట్రేడింగ్ వాల్యూమ్‌లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×