E-Paper
Advertisement

Gold – Silver Prices: కిందకు రామంటున్న బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లో పైపైకి

Gold – Silver Prices: కిందకు రామంటున్న బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లో పైపైకి
Advertisement

Gold – Silver Prices: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో ఎగబాకుతోంది. తొలిసారిగా ఔన్స్ ధర 5,000 డాలర్లను టచ్ చేసింది. అటు వెండి ధర కూడా ఔన్స్‌కు 105 డాలర్ల నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడ్ అయ్యింది. వీటి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఉన్నట్లుండి వీటి ధరల పెరుగుదలకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక -రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు కారణంగా చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పైపైకి బంగారం-వెండి ధరలు

Advertisement

పుత్తడి, వెండి ధరల పెరుగుతూనే ఉంటున్నాయి. ఏ మాత్రం దిగిరావడం లేదు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ఎక్కువగా వాటిపై ఫోకస్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10 గ్రాముల) ధర తొలిసారిగా 5,000 డాలర్లను అధిగమించింది. వెండి ధర కూడా అదే దారిలో పయనిస్తోంది. 108.25 డాలర్లను టచ్ చేసింది. ఈ రెండు గరిష్ట స్థాయిలను తాకాయి.

2000 ఏడాదిలో బంగారం ఔన్స్ ధర 267 డాలర్లు ఉండేది. 2020 నాటికి అది కాస్త 1971 డాలర్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో ఈ ఏడాది జనవరి నాటికి 5095 డాలర్లు తాకింది. వీటి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం.

Advertisement

ప్రపంచ దేశాల్లో మార్కెట్లు పతనం, బంగారంపైకి మదుపరుల చూపు

గ్రీన్‌ల్యాండ్ వ్యవహారంలో అమెరికా- యూరప్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు ఉక్రెయిన్, గాజా ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు కూడా మరొక కారణం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌పై అమెరికా చర్యల వల్ల ఇన్వెస్టర్లలో భయం రెట్టింపు అయ్యింది. తాజాగా ఇరాక్-అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు మార్కెట్లపై పడ్డాయి. చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. పరిస్థితులను గమనిస్తున్న ఇన్వెస్టుదారులు బంగారం, వెండిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ధరలను ఆశాకాన్ని తాకాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్రిక్తతలు కంటిన్యూ అయితే బంగారం, వెండి ధరలు పైకి ఎగబాకవచ్చని చెబుతున్నారు.

ALSO READ: దేశవ్యాప్తంగా మంగళవారం బ్యాంకుల సమ్మె.. వెనక్కి తగ్గని ప్రభుత్వం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక పన్నులు, ఛార్జీల కారణంగా నగరాల్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్లో జనవరి 27న మంగళవారం ఉదయం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,61,950 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం రూ.1,48,450 కు కొనసాగుతోంది.

వెండి ధర ఒక్కరోజులో 10 వేలు పెరిగింది. దీంతో కిలో వెండి రూ.3,75,000కు చేరుకుని కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కిలోకు రూ.3,60,100 వద్ద కొనసాగుతోంది. అదే 10 గ్రాముల వెండి ధర రూ.3,601 వద్ద ఉంది. 100 గ్రాముల వెండి ధర రూ.36,010 ట్రేడింగ్ అవుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,960 ఉంది. సాయంత్రానికి ఆయా రేట్లు పెరగొచ్చు లేదంటే తగ్గవచ్చు కూడా. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,110 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,610 వద్ద ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,960 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ప్రస్తుతం ఉంది.

ఐటీ సిటీ బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960 ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద కొనసాగుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×