E-Paper
Advertisement

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే
Advertisement

Credit Cards: క్రెడిట్ కార్టు.. ఈ పదం గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ చాలామంది వాటిని తీసుకునేందుకు ఇప్పటికీ భయపడుతుంటారు. ఏ మాత్రం ఆలస్యమైనా, వడ్డీ మీద వడ్డీ పడుతుంది. ఒక్క పైసా బాకీ ఉన్నా,సదరు బ్యాంకులు మోత మోగిస్తాయి. వీటికి భయపడి తీసుకునేందుకు చాలామంది ముందుకు రారు. దేశంలో తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగం మంది జెన్‌జీ దే ఆధిపత్యం. వారంతా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారు ఉంటున్నారట. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ.

కొత్త క్రెడిట్ కార్డుల నిజాలు-దేశంలో అన్ని రంగాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటిలా భయపడే రోజులు పోయాయి. యూత్ అన్ని రంగాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో కూడా యువత దూకుడు మామూలుగా లేదు. సిటీల్లో క్రెడిట్ కార్డులు తీసుకునేవారు ఎక్కువగా ఉండేవారు. అందులో ఉద్యోగాలు చేసేవారు, ఎక్కువ ఆదాయం ఉన్నవారి చేతిలో ఆయా కార్డులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మారుతున్నాయి.

Advertisement

 సగానికి జెన్ జీలదే హవా-దేశంలో తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగం మంది ఇప్పుడు జెన్‌జీ యువతదే. వారంతా 30 ఏళ్లలోపు వారే. వారిలో సగానికి పైగానే సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచి వారు ఉంటున్నారని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన నివేదిక ప్రస్తావించింది. యువత రుణాల వినియోగం పెరగడం, చిన్న పట్టణాలు క్రెడిట్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.

సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల యువత-ఒక్కమాటలో చెప్పాలంటే భారత క్రెడిట్ కార్డ్ రంగంలో పెద్ద మార్పుకు సంకేతం. ఈ ఏడాది మార్చి నాటికి మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో 50 శాతం మందిలో 30 ఏళ్లలోపు యువతీయువకులు ఉన్నారు. నాలుగేళ్ల కిందట కేవలం 43 శాతం ఉండేది. కొత్త కార్డు హోల్డర్లలో  46 శాతం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.

Advertisement

నాలుగేళ్ల కిందట 42 శాతంగా ఉండేది. ఆ నివేదిక ప్రకారం.. క్రెడిట్ కార్డులు ఇకపై మెట్రో సిటీలకు పరిమితం కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. దశాబ్దంపాటు పరిశీలిస్తే.. దేశంలో క్రెడిట్ కార్డ్ మార్కెట్ భారీగా పెరిగింది. సరిగ్గా 2016లో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 1.4 కోట్లు సంఖ్య ఉండేది.

ALSO READ: ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

ఈ ఏడాది నాటికి 5.2 కోట్లకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ బకాయిలు భారీగా పెరిగాయని ఆ నివేదిక సారాంశం. 2016లో దాదాపు  రూ. 40 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 3 లక్షల కోట్లకు పైగానే చేరింది. ఆ లెక్కన ప్రతి కార్డు హోల్డర్‌పై సగటు బకాయి రూ. 31 వేలు నుంచి రూ. 65 వేల వరకు పెరిగిందన్నమాట.

దేశంలో క్రెడిట్ కార్డ్ మార్కెట్  10 ఏళ్లుగా గణనీయమైన వృద్ధిని సాధించిందని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ భావేష్ జైన్ అన్నారు. రెండేళ్లుగా క్రెడిట్ పనితీరు గణనీయంగా మెరుగుపడినప్పటికీ, బ్యాలెన్స్‌ల పరంగా, కార్డు హోల్డర్ల సంఖ్య పరంగా క్రెడిట్ కార్డ్ మార్కెట్ వృద్ధి చెందలేదన్నారు.

ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 25 శాతం మంది  క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారని తెలిపారు. అదే కొలంబియా-62 శాతం, యూకే-70 శాతం, హాంగ్ కాంగ్‌-98 శాతంతో ఉన్నాయి. వాటితో పోలిస్తే చాలా తక్కువని, ఈ రంగం విస్తరణకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×