E-Paper
Advertisement

Fintech Unicorn Razorpay: ఆ ఉద్యోగులకు పంట.. కంపెనీలో వారే ఓనర్లు, అదెలా?

Fintech Unicorn Razorpay: ఆ ఉద్యోగులకు పంట.. కంపెనీలో వారే ఓనర్లు, అదెలా?
Advertisement

Fintech Unicorn Razorpay:  పెర్పార్మెన్స్ బాగుంటే ఏడాది చివరలో ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇస్తుంటాయి కొన్ని కంపెనీలు.  దీపావళి సందర్భంగా చెన్నైలోని ఓ కంపెనీ ఉద్యోగులకు కారులు ఇచ్చింది. కంపెనీ స్థాయికి తగ్గట్టుగా బహుమానం ఇస్తుంటాయి. ఈ విషయంలో ఒక్కో కంపెనీది ఒక్కో స్టయిల్.

రీసెంట్‌గా ఫిన్‌టెక్ యూనికార్న్ రేజర్ పే లో పని చేస్తున్న ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది ఆ కంపెనీ. పని చేస్తున్న 3000 సిబ్బందికి లక్ష విలువ చేసే ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ఇచ్చింది. రేజర్ పే ఈ స్థాయిలో స్టాక్ ఆప్షన్ అందించడం ఇదే తొలిసారి.

Advertisement

పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు గతంలో ఈ తరహా ఆప్షన్ ఇచ్చామంటోంది ఆ కంపెనీ. మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన కంపెనీలో వారే ఓనర్లు. గతంలో రేజర్ పేకి సంబంధించి స్టాక్ ఆప్షన్లు అందుకున్న ఉద్యోగులు పలుసార్లు బౌ బ్యాక్ ద్వారా ఈ ప్రయోజనం పొందారు.

ఈ విధంగా ఆరేళ్ల కిందట ఈ కంపెనీ ప్రారంభించింది. అప్పుడు కేవలం 140 మందికి మాత్రమే ఇచ్చింది. 2019లో 400 మంది, 2021లో 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. 2022లో దాదాపు 650 మంది ఈ ప్రయోజనం పొందినవారిలో ఉన్నారు. మాజీ ఉద్యోగులు సైతం ఇందులో ఉన్నారు.

Advertisement

ALSO READ: ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు షాకిచ్చిన ఎక్స్.. మస్క్ అంటేనే పక్కా కమర్షియల్ మరి!

రేజర్ పే సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్షిల్ మాథుర్ మాట్లాడుతూ, కంపెనీ విజయం వెనుక ఉద్యోగులదే కీలకపాత్ర అని చెప్పారు. కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి చొరవ తీసుకోవడం అసాధారణమన్నారు. మొత్తానికి ఈ కంపెనీ ఉద్యోగుల పంట పడిందనే చెప్పవచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ దేశంలో చాలా కంపెనీలు అమలు చేస్తున్న విషయం తెల్సిందే.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×