E-Paper
Advertisement

UPI Payments: యూపీఐ చెల్లింపులపై 18 శాతం ట్యాక్స్? ఇది మీరు నమ్మేశారా.. వాస్తవం ఏమిటంటే?

UPI Payments: యూపీఐ చెల్లింపులపై 18 శాతం ట్యాక్స్? ఇది మీరు నమ్మేశారా.. వాస్తవం ఏమిటంటే?
Advertisement

Fact Check: ఏటీఎంకి వెళ్లి డబ్బులు తీసే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా యూపీఐనే. అందరూ నగదును డిజిటల్‌ విధానంలోనే చెల్లిస్తున్నారు. అయితే, ఇటీవల జనాలు షాకయ్యే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూపీఐ(UPI) ద్వారా చేసే చెల్లింపులకు కూడా పన్ను చెల్లించాలని, రూ.5000 వేలు దాటితే 18 శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసి ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. మరి నిజంగా ప్రభుత్వం ఈ రూల్ పెట్టిందా? చెల్లింపుల మీద రూ.18 శాతం పన్ను విధిస్తుందా? ఈ ప్రచారంపై ప్రభుత్వం ఏం చెప్పింది తదితర వివరాలు మీ కోసం.

ఆ వార్తలో నిజమెంత?

సోషల్ మీడియా అంటేనే.. ఫేక్ వార్తలకు అడ్డా. ఆందోళన కలిగించే చిన్న పోస్ట పెట్టినా దావనంలా వ్యాపించి వైరల్ అయిపోతుంది. తాజాగా యూపీఐ చెల్లింపులపై 18 శాతం ట్యాక్స్ విధిస్తున్న వార్త కూడా ఇలాగే వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు ఇప్పుడు యూపీఐతో చెల్లింపులు కూడా కష్టమేనా అని దిగులు పడుతున్నారు. అయితే కంగారు పడకండి. దీని గురించి మా ‘బిగ్ టీవీ లైవ్’ ప్రతినిధులు కీలక విషయాలు కనుగొన్నారు. యూపీఐ చెల్లింపులపై 18 శాతం పన్ను అనేది కేవలం ఒక రూమర్ మాత్రమేనని తెలుసుకున్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటీ?

Advertisement

మీరు యూపీఐ ద్వారా రూ.5000 ఎవరికైనా చెల్లించారంటే.. 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు ప్రత్యక్షం అయ్యాయి. దీనిపై ‘బిగ్ టీవీ లైవ్’ ప్రతినిధులు ఆరా తీస్తే.. అది ఫేక్ వార్త అని తెలిసింది. మీరు యూపీఐ ద్వారా డబ్బులు తీసుకున్నా, చెల్లించినా సరే ఎలాంటి ట్యాక్సు పడదు. కాబట్టి.. హాయిగా ఊపిరి పీల్చుకోండి. ఫేక్ వార్తలను నమ్మి ఆందోళన చెందకండి.

యూపీఐ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ

యూపీఐ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్తగా ట్యాక్సులు, జీఎస్టీలు విధిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, గత ఆగస్టు నెలలో కొన్ని వార్తా సంస్థలు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో షాకింగ్ నిర్ణయం తీసుకోనుందని, యూపీఐ చెల్లింపులపై కూడా భారీగా పన్నులు విధించి సొమ్ము చేసుకోడానికి సన్నహాలు చేస్తోందనేది ఆ వార్తల సారాంశం. దానివల్లే ఈ ఫేక్ సమాచారం వైరల్ అయినట్లు మా ప్రతినిధులు తెలుసుకున్నారు. కాబట్టి.. ఇకపై మీరు ఎలాంటి సందేహాలు లేకుండా UPI లావాదేవీలు కొనసాగించండి.

2026లో యూపీఐ పేమెంట్స్‌లలో వచ్చిన మార్పులు ఇవే

Advertisement

యూపీఐ యాప్స్‌లోని ఈఎంఐ, సిప్స్ ఇతరాత్ర ‘ఆటో పే’ పేమెంట్ లావాదేవీలన్నీ నాన్-పీక్ హావర్స్‌లో కూడా జరగనున్నాయి. అలాగే మీరు యూపీఐ యాప్స్‌లో మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా పరిమితి విధించారు. ఒక్కో యాప్‌లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. వ్యాపారస్తులు జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ క్యూర్‌పై తప్పకుండా జీఎస్టీ నెంబర్ ఉండాలి. క్యాష్ ఎక్స్‌ఛేంజ్‌కు మాత్రం యూపీఐను వాడొద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Also Read:  ఐఫోన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 200MP కెమెరా ఐఫోన్ లాంచ్ అప్పుడే

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×