E-Paper
Advertisement

ఈఎంఐ కిటుకేంటి? ఎలా లెక్కిస్తారంటే?

ఈఎంఐ కిటుకేంటి? ఎలా లెక్కిస్తారంటే?
Advertisement

EMI Formula: నెలలో జీతం కంటే ముందుగా పలకరించేది EMI. అప్పులను సమాన భాగాలుగా తిరిగి చెల్లించడమే ఈఎంఐ. అసలు ఈఎంఐ అంటే ఏంటి, ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. EMI అంటే.. ఈక్వెటెడ్ మంథ్లీ ఇన్స్టాల్మెంట్. ఒక నిర్దిష్ట కాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడానికి క్రమం తప్పకుండా చెల్లించే స్థిరమైన మొత్తం EMI. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి.

EMI అంటే సమాన నెలవారీ వాయిదా. హోమ్ లోన్, వెహికల్, పర్సనల్ లేదా ఇతర అప్పులను తిరిగి చెల్లించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నెలవారీ చెల్లింపులను అనుమతిస్తాయి. పెద్ద మొత్తంలో తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత కాలం పాటు సమాన వాయిదాల్లో చెల్లించేందుకు రుణ సంస్థలు కస్టమర్లను అనుమతిస్తాయి. ఉదాహరణకు, మీరు కొత్త కారు కొనాలనుకుంటే అందుకు తగిన మొత్తం మీ వద్ద లేకపోతే, కారు లోన్‌ను తీసుకోవచ్చు. కాస్త డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని EMIల ద్వారా తిరిగి చెల్లించవచ్చు.

EMI ఎలా పనిచేస్తుంది?

Advertisement

EMIను అర్థం చేసుకుంటే.. మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

Step 1: బ్యాంకు లోన్ అప్రూవ్ చేసి ఆ మొత్తాన్ని రుణగ్రహీతకు బదిలీ చేస్తారు.

Advertisement

Step 2: సమాన నెలవారీ వాయిదాల (EMI) ద్వారా కస్టమర్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

Step 3: ప్రతి EMIలో అసలు+వడ్డీ ఛార్జీలు రెండూ ఉంటాయి.

Step 4: ఈఎంఐ స్టార్టింగ్ లో వడ్డీ చెల్లింపునకే ఎక్కువ భాగం కేటాయిస్తారు.

Step 5: కాలక్రమేణా ఈఎంఐలో అసలు మొత్తం పెరిగి, వడ్డీ మొత్తం తగ్గుతుంది.

Step 6: ప్రతి ఈఎంఐ తర్వాత, మిగిలిన రుణంపై వడ్డీని తిరిగి లెక్కిస్తారు.

EMIని ఎలా లెక్కిస్తారు?

EMIలను రెండు పద్ధతులలో లెక్కిస్తారు. ఇవి స్థిర వడ్డీ రేటు, తగ్గుతున్న బ్యాలెన్స్ విధానం.

ఫిక్స్ డ్ రేటు ఈఎంఐ పద్ధతి

ఈ విధానంలో లోన్ పీరియడ్ లో లోన్ మొత్తంపై వడ్డీని లెక్కిస్తారు. తిరిగి చెల్లించే సమయంలో EMI స్థిరంగా ఉంటుంది.

EMI = [P x R x (1+R)^N] / [(1+R)^N-1]

  • P = ప్రిన్సిపల్ అమౌంట్
  • R = నెలవారీగా వడ్డీ రేటు
  • N = లోన్ టెన్యూర్ (నెలల్లో)

రుణం తగ్గుతున్నప్పటికీ దానితో సంబంధం లేకుండా, ప్రతి నెలా ఒకే మొత్తాన్ని ఈఎంఐ చెల్లిస్తారు.

Also Read:  అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!

రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి

రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతిలో ఇంకా చెల్లించాల్సిన అసలుపై మాత్రమే వడ్డీని లెక్కిస్తారు. మీరు EMI చెల్లించే కొద్దీ, అసలు మొత్తం తగ్గుతుంది. దీని ఫలితంగా వడ్డీ కూడా క్రమంగా తగ్గుతుంది. EMI స్థిరంగానే ఉంటుంది, కానీ క్రమంగా చెల్లించే వడ్డీ తగ్గుతుంది. అదే సమయంలో తిరిగి చెల్లించే అసలు మొత్తం పెరుగుతుంది. ఫిక్స్ డ్ రేటు పద్ధతితో పోలిస్తే ఇందులో వడ్డీ తక్కువగా ఉంటుంది కాబట్టి, లోన్ తీసుకున్న వారు కాస్త పొదుపు చేసుకోవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×