E-Paper
Advertisement

Bus Ticket Booking @ Flipkart: బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ లక్కీ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు!

Bus Ticket Booking @ Flipkart: బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ లక్కీ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు!
Advertisement
Flipkart Bus Ticket Booking Services
Flipkart Bus Ticket Booking Services

Flipkart Started Bus Ticket Booking Services: దిగ్గజ డిజిటల్ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ గుడ్ న్యూస్.. తన వినియోగుదారులకే కాకుండా.. దూర ప్రాంతాలకు బస్సులో ప్రయాణించే వారికి తీపి కబురు కానుంది.

తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బస్ టికెట్ సేవలను ప్రారంభించింది. అయితే కొద్ది రోజుల పాటు ఎటువంటి అదనపు ఛార్జ్ లేకుండా బస్ టికెట్ బుక్ చేసుకునే వీలు కల్పించింది.

Advertisement

తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రాష్ట్ర రవాణా కార్పోరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుని పలు రాష్ట్రాల్లో బస్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

అయితే బస్ టికెట్ బుక్ చేసుకునేవారు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. నూతనంగా ఈ సర్వీసు ప్రారంభించిన నేపథ్యంలో ఈనెల 15వ తేదీ వరకు 20 శాతం వరకు రాయితీని కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

Also Read: బోట్ యూజర్లకు షాక్.. ప్రమాదంలో 75 లక్షల మంది డేటా..

దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలను అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్‌ ఈ సర్వీసును ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే విమాన టికెట్, హోటల్ బుకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×