E-Paper
Advertisement

షాపింగ్ మీది.. బ్యాగుల బరువు మాది.. స్టార్టప్ కంపెనీ క్రేజీ ఐడియా!

షాపింగ్ మీది.. బ్యాగుల బరువు మాది.. స్టార్టప్ కంపెనీ క్రేజీ ఐడియా!
Advertisement

Shopping Assistance: ప్రస్తుత డిజిటల్ యుగంలో నిత్యావసరాల నుండి లగ్జరీ వస్తువుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మార్కెట్లోకి నేరుగా వెళ్లి షాపింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. ఒకవేళ వెళ్లినా.. బరువైన బ్యాగులను భుజాలపై మోస్తూ మార్కెట్లో షాపింగ్ చేయడం అంటే చాలామందికి చికాకుగా అనిపించవచ్చు. సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాష్ చేసుకునేందుకు దిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ.. సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కేవలం రూ. 149లకే ‘షాపింగ్ అసిస్టెన్స్’ (Shopping Assistance) అందిస్తామంటూ ప్రకటించింది. అయితే ఈ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏంటీ ‘షాపింగ్ అసిస్టెన్స్’ సర్వీస్?

దిల్లీలోని లజపత్ నగర్, సరోజినీ, చాందినీ చౌక్ వంటి ప్రాంతాలు షాపింగ్ చేసేవారితో నిత్యం రద్దీగా ఉంటాయి. ఆ ఏరియాల్లో షాపింగ్ కు వెళ్లినవారు.. మరీ ముఖ్యంగా స్త్రీలు ఓ చేతిలో షాపింగ్ బ్యాగులు.. మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్, మెుబైల్ మోస్తూ ఎంతో ఇబ్బందిగా తిరుగుతుంటారు. అయితే దీనికి చెక్ పెడుతూ దిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ క్యారీమెన్.. వినూత్న ఆలోచన చేసింది. గంటకు రూ.149 చెల్లిస్తే.. బ్యాగులు మోసే అసిస్టెంట్ ను సరఫరా చేస్తుంది. కాబట్టి బ్యాగుల బరువు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా నచ్చిన వస్తువును కొనుగోలు చేసే వెసులుబాటును కస్టమర్లకు కల్పిస్తోంది.

Advertisement

అసిస్టెన్స్ చేసే సాయం..

క్యారీమెన్ సంస్థ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఈ షాపింగ్ అసిస్టెన్స్ కేవలం బరువు మోయడమే కాకుండా స్త్రీలకు రక్షణను సైతం కల్పిస్తారు. దొంగతనాల నుంచి రక్షణగా ఉంటారు. షాపింగ్ పూర్తైన తర్వాత పార్కింగ్ లేదా మెట్రో, బస్ స్టేషన్ చేరేవరకూ మీ వెంటే తోడుగా రానున్నారు. అంతేకాదు ఆహారం, స్నాక్స్ వంటి వాటికి ఉండే పొడవైన క్యూలైన్ల వద్ద వీరి సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా మరికొంత అదనపు రుసుము చెల్లించి.. బేబీ క్యారియర్, గొడుగు పట్టడం, మెుబైల్ ఛార్జింగ్, కుర్చీ వంటి సదుపాయాలను ఈ షాపింగ్ అసిస్టెన్స్ నుంచి పొందొచ్చని క్యారీమెన్ సంస్థ పేర్కొంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మాత్రమే ఉండే ‘పర్సనల్ స్టైలిస్ట్’ లేదా ‘షాపింగ్ గైడ్’ సంస్కృతిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని సదరు స్టార్టప్ పేర్కొంది.

Advertisement

Also Read: అధికారంలోకి వస్తే.. హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక హామీ!

నెట్టింట భిన్నాభిప్రాయాలు..

క్యారీమన్ కంపెనీ తీసుకొచ్చిన వినూత్న సేవల పట్ల నెట్టింట భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని అద్భుతమైన ఐడియా అని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇదొక దండగ సర్వీస్ అని కొట్టిపారేస్తున్నారు. ‘బట్టలు లేదా ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు ఏది బాగుంటుందో తేల్చుకోలేక గంటల తరబడి సమయం వృథా అవుతుంది. అలాంటి సమయంలో గంటకు రూ. 149 అంటే.. ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘డబ్బు ఇచ్చి మరీ షాపింగ్ చేయడానికి అసిస్టెంట్ ను పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది’ అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

Also Read: ఇది కదా ప్లాన్ అంటే.. రూ.79కే జియో అదిరిపోయే గిఫ్ట్.. నెలంతా ఎంజాయ్ పండగో!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×