E-Paper
Advertisement

Crude Oil Prices: సెంచరీ కొట్టిన ముడి చమురు.. బ్యారెల్ 106 డాలర్లు నాట్ అవుట్

Crude Oil Prices: సెంచరీ కొట్టిన ముడి చమురు.. బ్యారెల్ 106 డాలర్లు నాట్ అవుట్
Advertisement

Crude Oil Prices: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్క్‌ దాటేసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అమెరికాలో క్రూడ్ ఆయిల్‌ ధర 2.6 శాతం పెరిగి 101 డాలర్లకు చేరుకుంది.

ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి చమురు ధరలు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుత ధరలు 40 శాతం మేర పెరిగి 2022 నాటి గరిష్ఠాలకు చేరాయి. హర్మూజ్‌ జలసంధిని కాపాడి ఇంధన రవాణాను యథావిధిగా చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకురావాలని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పిలుపునిచ్చారు.

40-50 శాతం పెరిగిన ధరలు

Advertisement

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బెంచ్‌మార్క్ చమురు ధరలు 40% నుంచి 50% మధ్య పెరిగాయి. గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించడం, చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ముడి చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ సౌదీ, ఇజ్రాయెల్ పై దాడిని మరింత తీవ్రం చేసింది. ఈ యుద్ధంతో చమురు పరిశ్రమ ఇప్పటి వరకు ఎదుర్కొన్న ‘అతిపెద్ద సరఫరా అంతరాయం’గా మిగులుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.

రోజుకు 8.0 మిలినయ్ బ్యారెళ్లు మాత్రమే

చమురు ఉత్పత్తి రోజుకు 8.0 మిలియన్ బ్యారెళ్ల తగ్గిందని అంతర్జాతీయ ఇంధన అథారిటీ తెలిపింది. అయితే, ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నప్పటికీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఓడించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు. చమురు ధరల కంటే ఇరాన్ దుష్ట సామ్రాజ్యాన్ని అడ్డుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న రాజకీయ వివాదం ప్రపంచ మార్కెట్లలో తీవ్ర పరిస్థితులకు దారితీస్తున్నాయి.

Advertisement

Also Read:   వంటకు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎందుకు మంచిది? తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×