// // Credit Card New Rules: క్రెడిట్ కార్డు బిల్లులు రిపోర్ట్ చేయాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Credit Card New Rules: క్రెడిట్ కార్డు బిల్లులు రిపోర్ట్ చేయాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

Credit Card New Rules: క్రెడిట్ కార్డు బిల్లులు రిపోర్ట్ చేయాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Advertisement

Credit Card New Rules: ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలు 2026 ముసాయిదాను విడుదల చేసింది. ఈ నిబంధనలు ఆమోదం పొందితే ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయనున్నారు. కొత్త చట్టం ఆదాయపు పన్ను రూల్స్ 1962 ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల్లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి అనేక ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, పన్ను రిపోర్టింగ్, ఉద్యోగి వ్యక్తులకు అందుబాటులో ఉన్న కార్డు ప్రయోజనాలను ప్రభావితం చేస్తాయి.

5 ముఖ్యమైన అంశాలు

ఈ డ్రాప్ట్ లో క్రెడిట్ కార్డులకు సంబంధించి ఐదు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి.

Advertisement

1) అధిక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులను రిపోర్ట్ చేయాలి

ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, రూ.10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులను నగదు కాకుండా ఇతర మార్గాల ద్వారా చెల్లించినట్లయితే, బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థ ఆర్థిక లావాదేవీల ప్రకటనలో ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి.. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో బిల్లు చెల్లిస్తే లావాదేవీని ఇన్ కమ్ ట్యాక్స్ లో రిపోర్టు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆ వ్యక్తికి జారీ చేసిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులకు సంబంధించి బిల్లులను రిపోర్ట్ చేయాలి. ఈ నిబంధన గతంలోనే ఉంది. కానీ తాజా ముసాయిదాలో స్పష్టం చేశారు.

Advertisement

2) క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ అడ్రస్ ప్రూఫ్ -ఇన్ కమ్ ట్యాక్స్ డ్రాప్ నిబంధనల ప్రకారం, పాన్ కార్డు కోసం అప్లై చేసుకునేటప్పుడు మూడు నెలలకు లోపు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగించవచ్చు.

3) క్రెడిట్ కార్డులను.. డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో పాటు పన్నుల చెల్లింపు కోసం ఎలక్ట్రానిక్ విధానంగా అనుమతిస్తారు. పన్ను చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు.

4) ఇకపై క్రెడిట్ కార్డు పొందేందుకు పాన్ కార్డు అందించడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను రూల్స్ 2026 ముసాయిదా పేర్కొంది. ఇది కార్డు లావాదేవీలను పన్ను వ్యవస్థతో అనుసంధానించడాన్ని సులభతరం చేస్తుంది.

5) ఉద్యోగి లేదా అతడి కుటుంబ సభ్యులు.. ఏదైనా మెంబర్ షిప్ ఫీజులు, వార్షిక రుసుముల సహా ఇతర ఖర్చులను కంపెనీ ఇచ్చిన క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే.. వాటిపై కూడా ఆదాయపు పన్ను విధిస్తారు.

Also Read: క్రెడిట్ కార్డు క్లోజింగ్ లేట్ చేస్తున్నారా?.. బ్యాంక్ మీకు డబ్బులు కట్టాలి.. ఆర్బీఐ రూల్స్ ఇవే

క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్ పెద్ద లావాదేవీలను పర్యవేక్షించడం, డాక్యుమెంటేషన్‌ను ఈజీ చేయడం, పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే భారీ లావాదేవీలపై ట్యాక్స్ లు విధిస్తారు.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×