E-Paper
Advertisement

New Car Buying Tips: కార్లపై డిస్కౌంట్లు.. భారీ స్కామ్.. ఇవి తెలుసుకోండి!

New Car Buying Tips: కార్లపై డిస్కౌంట్లు.. భారీ స్కామ్.. ఇవి తెలుసుకోండి!
Advertisement

New Car Buying Tips: కార్ల కంపెనీలు జులై నెలలో వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఒక్క వాహనంపై గరిష్ఠంగా రూ.4 లక్షల కంటే ఎక్కువగా తగ్గింపు పొందుతారు. ఈ డిస్కౌంట్లు అందిచడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటి వరకు రూ.60,000 వేల కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు పెద్ద సంఖ్యలో కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ పాత స్టాక్ క్లియర్ చేసేందుకు కంపెనీలు డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

దీంతో చాలా మంది కస్టమర్లు ఈ డిస్కౌంట్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కార్ డీలర్ల చేతిలో మోసపోతున్నారు. మీరు ఇటువంటి మోసాల బారినపడకుంటా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. మార్కెట్‌లో తక్కువగా సేల్ అవుతున్న మోడళ్లపై మాత్రమే కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. తద్వారా పాత స్టాక్ క్లియర్ చేయవచ్చు. అంతేకాకుండా నెలల తరబడి అమ్ముడుపోని వాహనాలపై కూడా రాయితీలు ఇస్తున్నారు. కాబట్టి మీరు కారు కొనేముందు ఎప్పుడు తయారైందో తెలుసుకోండి.

Advertisement

మీరు కొనుగోలు చేసే కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. చాలా సార్లు మీరు ఎంచుకున్న వేరియంట్ అందుబాటులో ఉండదు. ఇది మీకు చాలా పెద్ద సమస్యను కలిగిస్తుంది. మీరు కార్ బేస్ మోడల్ కొనాలనుకున్నట్లయితే అది అందుబాటులో ఉండదు. అప్పుడు మీరు వేరే వేరియంట్ చూడొచ్చు. ఈ సందర్భంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే డీలర్లు మీకు టాప్ వేరియంట్‌ను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే దీనివల్ల వారికి అధిక కమీషన్ లభిస్తుంది.

కొత్త కారు కొనుగోలు చేసేముందు మీరు పాత కారును ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే దానిపై బెస్ట్ వాల్యూ అమోంట్ గురించి వివరంగా తెలుసుకోండి. మీ కారుకు వీలైనంత ఎక్కువ వాల్యూ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు డబ్బును ఆదా చేస్తారు.మీరు కొత్త కారు కొనడానికి షోరూమ్‌కి వెళ్లినప్పుడు సేల్స్‌మెన్ కొటేషన్‌పై యాక్సెసరీలను యాడ్ చేస్తాడు. ఇది కార్ ఆన్‌రోడ్ ధరను పెంచుతుంది.

Advertisement

Also Read: భారీ నష్టాల్లో స్కోడా.. సింగిల్ కారే సేల్.. సూబర్బ్ కారు ఫీచర్లు ఇవే!

సేల్స్‌మెన్ టూల్స్ ఇన్‌స్టాల్ చేయడానికి బలవంతం చేస్తారు. కానీ మీరు అతని మాయమాటల్లో పడకండి. దీని నుంచి బయటపడితే ధరను తగ్గించవచ్చు. ప్రతి నెల కార్ డీలర్లు సేల్స్ టార్గెట్ కలిగి ఉంటారు. కావలంటే కారు లాంచ్ అయినప్పుడు మొదటిలో ఎటువంటి ఆఫర్లు ఉండవు. అయితే కారు కొనాలంటే నెల చివరలో వెళ్లండి. ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. మీకు మంచి డీల్ వస్తుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×