E-Paper
Advertisement

Cognizant: మౌస్, కీ బోర్డ్.. కదలకపోతే ఖాళీగా ఉన్నట్లే.. ఉద్యోగులపై కాగ్నిజంట్ నిఘా? ఆ సంస్థ ఏం చెప్పిందంటే?

Cognizant: మౌస్, కీ బోర్డ్.. కదలకపోతే ఖాళీగా ఉన్నట్లే.. ఉద్యోగులపై కాగ్నిజంట్ నిఘా? ఆ సంస్థ ఏం చెప్పిందంటే?
Advertisement

Cognizant: ఐటీ సంస్థలు తమ ఉద్యోగులపై నిరంతర నిఘా పెడుతుంటాయి. ఉద్యోగులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఖాళీగా ఉంటున్నారో ఓ కంట కనిపెడుతుంటాయి. తాజాగా ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఈ తరహాలో ఉద్యోగులపై నిఘా పెట్టింది. ఈ మేరకు ప్రోహ్యాన్స్‌ మానిటరింగ్ వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్‌లలో ఎంతసేపు యాక్టివ్‌గా ఉంటారో ట్రాక్ చేసేందుకు, పని సమయంలో ఉపయోగించే అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లను ఈ వ్యవస్థతో పర్యవేక్షించనుంది.

ఈ వ్యవస్థను కంపెనీ జారీ చేసిన ల్యాప్ టాప్ లలో ఇన్ స్టాల్ చేస్తుంది. ఇది మౌస్, కీబోర్డ్ యాక్టివిటీని లాగ్ చేసి పనిసమయాలను అంచనా వేస్తుంది. ఐదు నిమిషాలు ఇన్ యాక్టివ్ గా ఉంటే ఖాళీగా ఉన్నట్లు, 15 నిమిషాల పాటు ఇన్ యాక్టివ్ ఉంటే వేరే పనిలో నిమగ్నమైనట్లు గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాగ్నిజెంట్ ఉద్యోగులపై నిఘా పెట్టలేదని తెలిపింది.

కాగ్నిజెంట్ ఏమన్నదంటే?

Advertisement

కస్టమర్ల అభ్యర్థన మేరకు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ లేదా ఇంట్యూటివ్ ఆపరేషన్స్, ఆటోమేషన్ ప్రాజెక్టులలో అప్పుడప్పుడు పలు సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తామని కాగ్నిజెంట్ తెలిపింది. ఇది సాధారణ ప్రక్రియ అని, కస్టమర్ల అభ్యర్థన మేరకే ఇలా చేస్తామని పేర్కొంది. ఈ వ్యవస్థ ఉద్దేశం ప్రాసెస్ డిజైన్ క్లయింట్ ప్రాసెస్ చేయడానికి, బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఈ సాధనాలు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును ట్రాక్ చేయడానికి కాదని తెలిపింది. ఉద్యోగుల అనుమతి తర్వాతే ఈ మానిటరింగ్ వ్యవస్థను ఉపయోగిస్తామని తెలిపింది. ఉద్యోగుల పనితీరుకు వీటితో సంబంధం లేదని ఐటీ సంస్థ వెల్లడించింది.

కాగ్నిజెంట్ మానిటరింగ్ వివాదం

ప్రోహ్యాన్స్ డాష్‌బోర్డ్‌లు ఉద్యోగి పని సమయాలను అంచనా వేస్తు్ంటాయి. లాగిన్ సమయాలు, యాక్టివ్ అప్లికేషన్‌లు, వివిధ పనుల వ్యవధిని ట్రాక్ చేస్తున్నాయని తెలుస్తోంది. వర్క్‌ఫ్లో, ఆప్టిమైజేషన్ కోసం వివిధ ప్రాంతాలను గుర్తించడానికి, సిస్టమ్ పనితీరు, ఉద్యోగి విరామాలు, ఉద్యోగ సమయాన్ని ఇవి మ్యాప్ చేస్తాయి. కాగ్నిజెంట్ D+ స్కోర్‌కార్డ్‌ను కూడా ఉపయోగిస్తుందని తెలుస్తోది. ఇది డెలివరీ, ప్రాక్టీస్, ట్రాన్స్‌ఫర్మేషన్ టీమ్ లోత వ్యాపార యూనిట్ హెడ్‌లకు ప్రాజెక్టు పనితీరు స్కోర్‌లను అందిస్తుంది. దీని ఐడియాబాక్స్ ప్లాట్‌ఫామ్ ఉద్యోగి సమయాలను, ఇతర వివరాలను ట్రాక్ చేస్తుంది.

Advertisement

Also Read: TRAI Deadline: ట్రాయ్ డెడ్‌లైన్.. ఆర్థిక మోసాలను చెక్, బ్యాంకు కాల్స్‌ 1600 సిరీస్‌తో మొదలు

ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ అనేది కంపెనీల సాధారణ పద్ధతి అని, ఇది వ్యాపార ప్రక్రియలో సహజమేనని పలు సంస్థలు అంటున్నాయి. ఆపరేషన్లు, ఆటోమేషన్ ప్రాజెక్టులలో కొంతమంది క్లయింట్ల అభ్యర్థన మేరకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఇది ఉద్యోగుల అనుమతితోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×